E-Paper
Advertisement

పుతిన్ కోసం రహస్య రైలు.. ప్రెసిడెంట్ ను కనిపెట్టడం అంత ఈజీ కాదా?

పుతిన్ కోసం రహస్య రైలు.. ప్రెసిడెంట్ ను కనిపెట్టడం అంత ఈజీ కాదా?
Advertisement

Putin Security: ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భద్రత విషయంలో ఆ దేశ సీక్రెట్ ఏజెన్సీ కీలక చర్యలు చేపడుతోంది. ఆయన సెక్యూరిటీ కోసం రష్యా అధికారులు తీసుకుంటున్న చర్యలు సాధారణ భద్రతా ఏర్పాట్ల కంటే మరింత హైలెవల్ లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందులో భాగంగానే పుతిన్ ప్రయాణాలను గుర్తించకుండా ఉండేలా, సీక్రెట్ రైళ్లు, ఒకేలా కనిపించే ఆఫీస్ లు, ఆలస్యంగా రిలీజ్ చేసే వీడియోలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

మొక్కలను చూసి తేదీలు గుర్తింపు

ఫుతిన  సెక్యూరిటీకి సంబంధించి తాజాగా న్యూయార్క్ టైమ్స్ కీలక వివరాలను వెల్లడించింది. పుతిన్ సమావేశాలపై పరిశోధన చేస్తున్న జర్నలిస్టులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తించారు. టీవీలో కనిపించే ఆయన కార్యాలయాల్లోని మొక్కల పరిస్థితి రోజురోజుకూ మారుతూ ఉండటం వారి దృష్టికి వచ్చింది. మొక్కల ఆకులు ఎప్పుడు తాజాగా ఉన్నాయి?  ఎప్పుడు వాడిపోయాయి? అనే విషయాలను పరిశీలించడం ద్వారా కొన్ని సమావేశాలు అధికారికంగా ప్రకటించిన తేదీల్లో జరగలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంటే, పుతిన్ కార్యక్రమాల వివరాలను బయటకు తెలియకుండా ఉంచేందుకు షూట్ డేట్లను మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఒకేలా కనిపించే ఆఫీస్ లు

Advertisement

పుతిన్ భద్రత కోసం మరో ఇంట్రెస్టింగ్ పద్ధతిని కూడా పాటిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఆయన నివాస ప్రాంతాల్లో దాదాపు ఒకే విధంగా కనిపించే ఆఫీస్ లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. గోడలు, తలుపులు, హ్యాండిల్స్, ఫర్నిచర్ లాంటివి ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వీడియోలో కనిపించే ఆఫీస్ ఆధారంగా పుతిన్ నిజంగా ఏ ప్రాంతంలో ఉన్నారో గుర్తించడం కష్టమవుతుంది.

పుతిన్ కోసం ప్రత్యేక రైలు

పుతిన్ ప్రయాణాలకు సంబంధించిన మరో అంశం సీక్రెట్ రైలు. ఆయన కోసం ప్రత్యేకంగా రెడీ చేసిన రైలు మార్గాలను ఉపయోగించే అవకాశం ఉంది. కొన్ని శాటిలైట్ ఫోటోల్లో ఆయన నివాస ప్రాంతాల సమీపంలో ప్రత్యేక రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు కనిపించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ రైలులో భద్రతతో పాటు ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. జిమ్, స్పా, సేఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సాధారణ ప్రయాణికుల రైలులా కనిపించేలా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మరింత భద్రత

Advertisement

కోవిడ్ సమయంలో పుతిన్‌ను కలవాలంటే అధికారులు ముందుగా క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చేది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత భద్రతా ఏర్పాట్లు మరింత కఠినంగా మారినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా భూభాగంలోకి కూడా చేరుతున్న నేపథ్యంలో పుతిన్ ప్రయాణాల వివరాలను రహస్యంగా ఉంచడం మరింత ముఖ్యంగా మారింది.  మాస్కోలో పుతిన్ కాన్వాయ్‌లు కూడా తరచూ చర్చకు వస్తుంటాయి. భారీ భద్రతా వాహనాలతో కూడిన కాన్వాయ్‌లు రాజధాని వీధుల్లో వేగంగా వెళ్లినప్పుడు, అందులో నిజంగా పుతిన్ ఉన్నారా? లేదా? అనేది స్పష్టంగా తెలియదని కొందరు భావిస్తున్నారు. పుతిన్ భద్రతా వ్యవస్థలో కేవలం బాడీగార్డులు మాత్రమే కాకుండా, సమాచారాన్ని నియంత్రించడం, ప్రయాణ మార్గాలను దాచడం, ఒకేలా కనిపించే ఆఫీస్ లను ఉపయోగించడం లాంటి బోలెడు వ్యూహాలను పాటిస్తున్నారు అధికారులు.

Read Also: 5 వారాల్లో 70 వేల టికెట్ల అమ్మకం.. ఎతిహాద్ రైల్‌ కు అదిరిపోయే రెస్పాన్స్!

Tags

Related News

రోజు రోజుకు తగ్గుతున్న రైల్వే ఫుడ్ బుకింగ్స్.. కారణం ఏంటంటే?

5 వారాల్లో 70 వేల టికెట్ల అమ్మకం.. ఎతిహాద్ రైల్‌ కు అదిరిపోయే రెస్పాన్స్!

12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూచే పువ్వు.. తుంచితే రూ.25000 జరిమానా..

2026లోనూ రైల్వే లైన్ లేని దక్షిణ భారత జిల్లాలు ఇవే.. కారణం తెలిస్తే షాక్!

కేవలం రూ.16కే ఫ్రెష్ బీర్.. వాటర్ బాటిల్ కంటే తక్కువ ధర.. బారులు తీరుతున్న జనం

పెళ్లి కాగానే.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు.. కొత్త జర్నీ ఇక్కడి నుంచే!

దోశను స్పూన్‌తో తినాలా? పైగా దానికి ట్రైనింగ్ కూడా!

Big Stories

Advertisement
×