BigTV English

Marriage Fraud: 50 మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ.. నగలు, డబ్బులే లక్ష్యం

Marriage Fraud: 50 మందిని పెళ్లి చేసుకున్న కిలాడి లేడీ.. నగలు, డబ్బులే లక్ష్యం

Marriage Fraud Women who married 50 men Arrested for Cheating: పెళ్లంటే నూరేళ్లు బంధమన్నారు మన పెద్దోళ్లు. మూడుముళ్లు ద్వారా ఒక్కటై. జీవితాంతం ఒకరికొకరి కలిసి బ్రతకడానికి ఏర్పరచుకున్నదే వివాహం బంధం. మరి అలాంటి పవిత్రమైన వివాహ బంధాన్ని పూర్తిగా విఛ్చనం చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సంధ్య అనే ఓ వివాహిత.. ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకుని నిత్య పెళ్లి కూతురుగా మారింది ఈ కిలాడీ లేడి.


తమిళనాడుకు చెందిన ఈ కంత్రీ వివాహిత సంధ్య వలలో చిక్కుకుని చాలా మందే ఉన్నారు. పోలీసు అధికారులనే బోల్తా కొట్టించిందంటే ఈ కిలాడీ లేడీ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. బాధితుల్లో ఏకంగా డీఎస్పీ, ఇద్దరు పోలీసు అధికారులు కూడా మోసం చేసింది ఈ మాయలేడి. వీరితో సహ 50 మందిని పెళ్లి చేసుకుంది. కేవలం నగలు, డబ్బులే లక్ష్యంగా ఈ బాగోతాన్ని నడిపించుకుంటూ వచ్చింది. అయితే ఓ యువకుడి ఫిర్యాదు ఆమె బండారం బయటపడింది. తమిళనాడుకి చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చినా ఇంకా మ్యారేజ్ కాకపోవడంతో.. డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్‌లో చూసి సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.

Also Read: సూరత్‌లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురి మృతి..


మ్యారేజ్ అయిన 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో అతనికి అనుమానం వచ్చి..ఆమె ఆధార్ కార్డు చెక్ చేయగా అందులో భర్త పేరు వేరే ఉంది. దీనిపై సంధ్యను ప్రశ్నించడంతో చంపేస్తానని బెదిరించింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. యువకుడి ఫిర్యాదుతో పోలసులు సంధ్యను అదుపులో తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటపడింది. అప్పటికే సంధ్య ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో సంధ్య అసల స్వరూపం బయటపడింది.

 

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×