Big Stories

Drone: రిషికేష్‌లో డ్రోన్లతో ఔషధాల తరలింపు..

Drone: ప్రస్తుతం కాలంలో డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఫొటో షూట్ల నుంచి పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడం.. పార్సిళ్లు డెలివరీ చేయడానికి కూడా డ్రోన్లను వాడుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లిళ్లలో డ్రోన్ల వినియోగం పెరిగిపోయింది. డ్రోన్లతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి వాటిని వారికి నచ్చినట్లుగా ఎడిట్ చేసుకుంటున్నారు.

- Advertisement -

తాజాగా ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో డ్రోన్ ద్వారా మెడిసిన్‌లను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి చేరవేశారు. ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి రెండు కిలోల బరువున్న టీబీ మందులను డ్రోన్ సాయంతో గర్వాల్ జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మొత్తం 40 కి.మీ దూరాన్ని డ్రోన్ కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించి గమ్యస్థానం చేరుకుంది. మందుల సరఫరాలో డ్రోన్ల వినియోగంపై టెస్ట్ డ్రైవ్‌లో భాగంగా దీనిని పరీక్షించారు.

- Advertisement -

అలాగే వ్యవసాయంలో కూడా డ్రోన్లను వినియోగిస్తున్నారు. గతంలో పంట పొలాలకు మందులు పిచికారి చేయాలంటే.. పిచికారి యంత్రాన్ని భుజాన మోసుకుంటూ పంట పొలాల్లో తిరుగుతూ చేసేవారు. కానీ ఇప్పుడు పొలం ఒడ్డున కూర్చొని డ్రోన్ సహాయంతో మందులు పిచికారి చేస్తున్నారు. డ్రోన్‌కు ఉన్న డ్రమ్ములో మందును పోసి రిమోట్ సాయంతో ఆపరేట్ చేస్తుంటే పిచికారీ చేస్తున్నారు. కాలికి మట్టి అంటకుండా చెట్టు నీడన కూర్చొని ఈ పద్ధతిలో మందు పిచికారి చేయవచ్చు.

ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజాలు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి కూడా పార్సిళ్లను డెలివరీ చేయడానికి డ్రోన్లను వినియోగిస్తున్నాయి. వీటి ద్వారా ఆర్డర్ వచ్చిన కొద్ది గంటల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే డ్రోన్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News