E-Paper
Advertisement

ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్… రెండు ప్రేమకథల ఎమోషనల్ జర్నీ

ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే యాక్సిడెంట్… రెండు ప్రేమకథల ఎమోషనల్ జర్నీ
Advertisement

Romantic Drama on OTT: ప్రేమలో పడినప్పుడు చెప్పాలనుకున్న మాట ఒక్కసారి ఆలస్యమైతే… ఆ బంధం ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా చెప్పలేకపోవడం ఒకవైపు… పెళ్లయిన తర్వాత కూడా మనసులోని బాధను బయట పెట్టుకోలేకపోవడం మరోవైపు. ఇలాంటి రెండు భిన్నమైన ప్రేమకథలు ఒకే యాక్సిడెంట్ కారణంగా అనుకోని విధంగా కలిస్తే ? ఆ ఒక్క ప్రమాదం నలుగురి జీవితాలను తలకిందులు చేస్తే ? అలాంటి ప్రేమ, బంధాలు, అపార్థాలు, ఎమోషన్స్‌తో తెరకెక్కిన యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామానే ‘ప్రేమదేశం’ (Premadesam). 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

అర్జున్ అనే యువకుడి జీవితంలో ఆద్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కాలేజీలో తనకంటే జూనియర్ అయిన ఆద్యను అర్జున్ ఇష్టపడుతుంటాడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ… ప్రేమ విషయాన్ని మాత్రం ఎవరూ బయట పెట్టరు. ఆద్యకు తనపై నిజంగానే ఇష్టం ఉందా ? లేక తనను కేవలం స్నేహితుడిగానే చూస్తుందా ? అనే సందేహం అర్జున్‌ను వెంటాడుతుంటుంది.

Advertisement

ఎప్పటికైనా తన మనసులోని మాట చెప్పాలని నిర్ణయించుకున్న అర్జున్… ఆద్యను కలసి ప్రపోజ్ చేయడానికి బయలుదేరుతాడు. కానీ ఆమెను కలవడానికి ముందే జరిగిన ఓ అనుకోని యాక్సిడెంట్ అతని జీవితాన్నే మార్చేస్తుంది. ఆ ప్రమాదం తర్వాత అర్జున్, ఆద్య ప్రేమకథ అనుకున్న దారిలో సాగదు. అంతేకాదు… ఆ ఘటన ప్రభావం మరో ఇద్దరి జీవితాలపై కూడా పడుతుంది.

మరోవైపు శివ, మాయ వివాహ బంధంలో ఉన్న జంట. భార్యాభర్తలే అయినపప్పటికీ వారి మధ్య మాత్రం తెలియని దూరం ఉంటుంది. పెళ్లికి ముందు జరిగిన కొన్ని చేదు సంఘటనలు మాయ మనసులో బలమైన ముద్ర వేస్తాయి. శివ ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించిన ప్రతిసారీ… గతం తాలూకు బాధలు వారి మధ్య అడ్డుగోడగా నిలుస్తుంటాయి.

Advertisement

ఒకవైపు ప్రేమను వ్యక్తం చేయడానికి ధైర్యం చేయలేకపోతున్న అర్జున్, ఆద్య… మరోవైపు పెళ్లయిన తర్వాత తమ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న శివ, మాయ. ఈ రెండు జంటల జీవితాలు ఒకే సంఘటనతో ఎలా ముడిపడ్డాయి ? ఆ యాక్సిడెంట్ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి ? ప్రేమలో ఉన్నప్పుడు మనసులోని మాట చెప్పకపోతే ఏం జరుగుతుంది? ఒక చిన్న అపార్థం ఇద్దరి మధ్య ఎంత పెద్ద దూరాన్ని తీసుకురాగలదు? గతంలో జరిగిన ఓ సంఘటనను మర్చిపోలేకపోతే ప్రస్తుత బంధం ఎలా ఎఫెక్ట్ అవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలనే సినిమాను చూడాల్సిందే.

తెలుగులోనే స్ట్రీమింగ్

శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిగుణ్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. మధుబాల, అజయ్ కతుర్వర్, మాయా ప్రీతి, వైష్ణవి చైతన్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు మరింత ఫీల్‌ను తీసుకొచ్చింది. ‘ప్రేమదేశం’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాను ఇంట్లోనే చూడొచ్చు. తెలుగు ఆడియోలోనే సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నా చెప్పుకోలేకపోయిన ఇద్దరు.. పెళ్లయినా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయిన మరో జంట.. వీళ్ల జీవితాలను ఓ చిన్న యాక్సిడెంట్ ఎలా మార్చిందో తెలుసుకోవాలంటే ఈ యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ మూవీని చూడాల్సిందే.

Read Also : ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో, రియల్ లైఫ్ లో జీరో… ఈ డార్క్ కామెడీ మూవీ చూస్తే షాక్

Related News

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

Big Stories

Advertisement
×