E-Paper
Advertisement

విమానాల టైర్లకు కార్లలా జిగ్‌జాగ్ గాడులు ఎందుకు ఉండవు? అసలు కారణం ఇదే!

విమానాల టైర్లకు కార్లలా జిగ్‌జాగ్ గాడులు ఎందుకు ఉండవు? అసలు కారణం ఇదే!
Advertisement

Airplane Tyre Design Explained: కారు టైర్లను చూసినప్పుడు వాటిపై రకరకాల గాడులు కనిపిస్తాయి. ముఖ్యంగా జిగ్‌ జాగ్ ఆకారంలో ఉండే ట్రెడ్ డిజైన్లు ఉంటాయి. వర్షం పడినప్పుడు రోడ్డుపై టైర్‌ కు మంచి పట్టు ఉండేందుకు ఈ గాడులు ఉపయోగపడతాయి. కానీ, విమానం టైర్ల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాటిపై సాధారణంగా నిటారుగా, వలయాల మాదిరిగా ఉండే గాడులు కనిపిస్తాయి. అసలు విమానాల టైర్లకు కార్ల మాదిరిగా జిగ్‌ జాగ్ గాడులు ఎందుకు ఉండవు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

విమానం ల్యాండ్ అయ్యేప్పుడు ఏం జరుగుతుంది?

విమానం రన్‌ వేపై దిగే సమయంలో టైర్లపై ఒక్కసారిగా పెద్ద మొత్తంలో భారం పడుతుంది. అంతేకాదు, విమానం అప్పటికే చాలా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో టైర్లు రన్‌వేను తాకిన వెంటనే వాటి వేగం విమానం ముందుకు కదులుతున్న వేగానికి సమానంగా ఉండదు. దీంతో టైర్లు రన్‌ వేపై కొద్దిసేపు జారుతూ, వేగానికి సరిపోయేలా తిరగడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో టైర్లపై పెద్ద మొత్తంలో రాపిడి ఏర్పడుతుంది. సాధారణ కారుతో పోలిస్తే విమానం టైర్లపై పడే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

జిగ్‌జాగ్ గాడులు ఉంటే ఏమవుతుంది?

Advertisement

కారు టైర్లలో కనిపించే జిగ్‌ జాగ్ ట్రెడ్ డిజైన్ రోడ్డు మీద పట్టు కోసం ఉపయోగపడతాయి. కారు మలుపులు తిరగాలి. వేగం మార్చాలి. పలు రకాల రోడ్లపై ప్రయాణించాలి. అందుకే కార్ల టైర్లకు ప్రత్యేకమైన ట్రెడ్ డిజైన్ అవసరం. విమానాలకు మాత్రం ఇలాంటి అవసరం అంతగా ఉండదు. విమానం రన్‌వేపై ఎక్కువగా నేరుగా ప్రయాణిస్తుంది. ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో మలుపులు తక్కువగా ఉంటాయి. కాబట్టి కార్ల టైర్ల మాదిరిగా ఎక్కువ కార్నరింగ్ గ్రిప్ అవసరం లేదు. అదే సమయంలో జిగ్‌జాగ్ నమూనాలు తీవ్రమైన రాపిడి, ఎక్కువ వేడి, భారీ బరువు నేపథ్యంలో త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే విమానాల టైర్లలో సరళమైన డిజైన్‌ను ఎంచుకుంటారు.

నీటిని తొలగించడంలో కీలక పాత్ర

విమాన టైర్లపై ఉండే సమాంతర గాడులకు మరో కీలకమైన పని ఉంది. వర్షం కారణంగా రన్‌వేపై నీరు చేరినప్పుడు టైర్లు నీటిపై తేలుతూ జారిపోకుండా ఈ గాడులు సహాయపడతాయి. టైర్ రన్‌వేపై అధిక వేగంతో తిరుగుతున్నప్పుడు గాడులు నీటిని వెనుక వైపుకు మళ్లిస్తాయి. దీంతో టైర్, రన్‌వే మధ్య సంబంధం మెరుగ్గా ఉంటుంది. విమానాలు అధిక వేగంతో ల్యాండ్ అవుతాయి కాబట్టి నీటిని సమర్థంగా తొలగించడం చాలా ముఖ్యం.

విమాన టైర్లకు మరో ప్రత్యేకత

Advertisement

విమాన టైర్లు సాధారణ కార్ల టైర్ల కంటే చాలా ఎక్కువ ఒత్తిడిని తట్టుకునేలా తయారు చేస్తారు. ల్యాండింగ్ సమయంలో భారీ బరువు, అధిక వేగం, రాపిడి, ఉష్ణోగ్రత లాంటి పరిస్థితులను అవి ఎదుర్కోవాలి. అందుకే టైర్ డిజైన్‌లో ఆకర్షణీయమైన ట్రెడ్ కంటే బలం, మన్నిక, స్థిరత్వం వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

Read Also: విమానంలో భోజనాలేందిరా? ఇదేమైనా బస్సు, రైలు అనుకున్నారా? వీడియో వైరల్!

Tags

Related News

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ!

Big Stories

Advertisement
×