BigTV English

Dhee 20 Promo : ఢీకి బ్రహ్మముడి కావ్య ఎంట్రీ..దండం పెట్టేసిన ఆది.. ట్విస్ట్ అదిరింది..

Dhee 20 Promo : ఢీకి బ్రహ్మముడి కావ్య ఎంట్రీ..దండం పెట్టేసిన ఆది.. ట్విస్ట్ అదిరింది..

Dhee 20 Promo : బుల్లితెర పై ప్రసారం ప్రముఖ డ్యాన్స్ షో ఢీ… ఇప్పటికే 19 సీజన్లు పూర్తి చేసుకుంది. దేశం నలుమూలాల నుంచి వచ్చిన ఎంతో మంది డ్యాన్సర్ లు ఈ షో ద్వారా సినిమాల్లో అవకాశాలను అందుకొని ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఈమధ్య కొంతమంది డాన్సర్లు మరోసారి కొత్త షో ద్వారా తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షో 20 సీజన్ ను జరుపుకుంటుంది. ఇందులో డాన్సర్లతో పాటు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్లు కూడా ఈ షోలో తమ టాలెంట్ ని నిరూపించుకోవడానికి వచ్చేసారు.. ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


ఢీ 20 ప్రోమో… 

ఢీ సీజన్ 20 ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ది గోల్డెన్ ఎర్ ఆఫ్ తెలుగు సినిమా అంటూ రెట్రో థీమ్‌పై ఈ ఎపిసోడ్ నిర్వహించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు అంతా పాత పాటలతో ఉర్రూతలూగించారు. గెటప్, డ్యాన్స్, లుక్స్, స్టైల్ అన్నీ పాత పాటల్లో ఉన్నట్లే ఉన్నాయి. జడ్డీలు విజయ్ బిన్ని మాస్టర్, రెజీనా కూడా రెట్రో లుక్‌లోనే వచ్చారు. ఇక ఈ ఎపిసోడ్‌కి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య వచ్చింది. ఆమె ఎంట్రీ అదిరిపోయింది. కావ్య ఎక్కడ ఎంట్రీ ఇస్తే అక్కడ అల్లరి మాములుగా ఉండదు. అలాగే ఈ షోలో కూడా ఆమె పై సెటైర్లు వేస్తారు. ప్రోమోకు హైలెట్ గా నిలుస్తుంది.


Also Read: శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ మూడింటిని మిస్ చెయ్యకండి..

హైపర్ ఆదికి మైండ్ బ్లాక్.. 

ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ తమలోని డాన్స్ టాలెంట్ ని బయటపెడుతుంటారు.. దీపిక డ్యాన్స్ చూసి హైపర్ ఆది అవాక్కయ్యాడు. డ్యాన్స్ పూర్తికాగానే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. దీపిక అంటే సూపర్ స్టార్.. నేనొక డ్యాన్సింగ్ స్టార్, నేనొక మార్నింగ్ స్టార్.. ఇది దీపిక స్టార్ అంటూ వాయించేసింది. మీరు ఈ షో కి ఎందుకు వచ్చారు అని యాంకర్ నందు అడగ్గా దీపికా సమాధానం చెప్పింది. దీపిక నీకు రష్మీ, వర్షిణి అనే ఇద్దరు తెలుసా అని ఆది అడిగితే తెలుసు అంటూ దీపిక ఆన్సర్ చెబుతుంది. రష్మీలో ఉన్న ఆ తెలుగుతనం.. వర్షిణిలో ఉన్న తింగరితనం.. ఆ అమ్మలే మళ్లీ పుట్టారు.. అంటూ ఆది వెటకారం ఆడాడు. అభితో డ్యాన్స్ చేస్తుంది. అది చూసిన ఆది ఏంటి చంపేస్తావా అని అడుగుతాడు. ఈ ప్రోమో మొత్తానికి దీపికా హైలెట్గా నిలిచింది.. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే మిస్ అవ్వకుండా చూడాలి.. ప్రస్తుతం దీపిక రంగరాజు వరుసగా సీరియల్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది..

Related News

Big Tv kissik Talks Show: రష్మి కంటే అనసూయ బెటర్.. సౌమ్యరావు షాకింగ్ కామెంట్స్!

Big Tv Kissik Talks : తినడానికి తిండి లేదు..కన్నీటి కష్టాలను బయటపెట్టిన సౌమ్యరావు!

Big Tv Kissik Talks: ఇండస్ట్రీలో సిండికేట్ ఉంది… చాలాసార్లు తొక్కేశారు..

Anshu Reddy -sree priya: త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం..షాక్ ఇచ్చిన బుల్లితెర నటీమణులు!

Keerthi Bhat: అదొక్కటే వాళ్లకు ముఖ్యం.. ఆ షో రహస్యాన్ని బయటపెట్టిన సీరియల్ నటి..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి కొత్త టెన్షన్.. నర్మద ప్లాన్ లో ఇరుక్కుంటుందా..? ట్విస్ట్ అదిరిపోయింది..

Big Stories

×