Youtube India : యూట్యూబ్‌లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలను పోస్ట్ చేస్తుండటంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ యూట్యూబ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇండియా లో ఉన్న యూట్యూబ్ కార్యలయానికి సమన్లు జారీ చేసింది. ఆ సంస్థ ప్రతినిధి జనవరి 15న అసభ్యకర ఛానళ్ల జాబితాతో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.ఇండియాలోని యూట్యూబ్ పబ్లిక్ పాలసీ హెడ్ మీరా ఛాట్‌కు కమిషన్ లేఖ పంపింది.
YouTube India : యూట్యూబ్‌లో కొన్ని ఛానళ్లు తల్లీ కొడుకులకు సంబంధించి అసభ్యకర వీడియోలను పోస్ట్ చేస్తుండటంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) యూట్యూబ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇండియాలో ఉన్న యూట్యూబ్ కార్యలయానికి సమన్లు జారీ చేసింది. సంస్థ ప్రతినిధి జనవరి 15న అసభ్యకర ఛానళ్ల జాబితాతో తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదశాలిచ్చింది. ఇండియాలోని యూట్యూబ్ పబ్లిక్ పాలసీ హెడ్ మీరా ఛాట్‌కు కమిషన్ లేఖ పంపింది.
ఇలాంటి వీడియోలు వల్ల చిన్నారుల భద్రతకు ఆటంకం ఏర్పడుతుందని NCPCR అందోళన వ్యక్తం చేసింది. పిల్లల శ్రేయస్సుకు హాని కలిగించే అవకాశం ఉందని పేర్కొంది. ఇలాంటి అసభ్యకరమైన వీడియోలను మైనర్లు వీక్షించేందుకు అనుమతి కల్పించడం పట్ల అందోళన చెందుతున్నామని NCPCR లేఖలో పేర్కొంది. అసభ్యకరమైన వీడియోలను తొలగించటానికి యూట్యూబ్ సంస్థ ఎటువంటి మెకానిజం వినియోగిస్తుందో తమకు తెలియజేయాలని ఆదేశించింది. తాము పంపిన సమన్లకు స్పందించకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
తల్లులు, యుక్త వయస్సు కలిగిన వారితో అసభ్యకరమైన వీడియోలను యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తున్నారని కమిషన్ చీఫ్ ప్రియాంక్ కనూంగో పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలతో పరోక్షంగా వ్యాపారం చేయడం.. అశ్లీల దృశ్యాలను అమ్మడం లాంటిదే అని కమిషన్ చీఫ్ ప్రియాంక్ కనూంగో పేర్కొన్నారు. ఇటువంటివి పోక్సో చట్టం ఉల్లంఘనలకే వస్తాయని తెలిపారు. దీనిపై యూట్యూబ్ కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి వీడియోలను చిత్రీకరించే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కమిషన్ చీఫ్ ప్రియాంక్ కనూంగో అగ్రహం వ్యక్తం చేసారు.