BigTV English

Odisha CM Mohan Charan Wife Priyanka: సర్పంచ్ నుంచి సీఎం స్థాయికి ఎదిగిన భర్త.. టీవీలో చూస్తే గానీ తనకు తెలియదన్న సతీమణి!

Odisha CM Mohan Charan Wife Priyanka: సర్పంచ్ నుంచి సీఎం స్థాయికి ఎదిగిన భర్త.. టీవీలో చూస్తే గానీ తనకు తెలియదన్న సతీమణి!

Odisha CM Mohan Charan Majhi Wife Priyanka Comments: రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు కూడా ఊహించలేరు. క్షణక్షణాలల్లోనే అటుది ఇటు.. ఇటుది అటు జరుగుతుంటాయి. అంతేకాదు.. ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. పదవుల విషయంలో కూడా ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంటది. తనకు ఆ పదవి వస్తుందని ఊహించని నేతలకు సైతం పలు కీలక పదవులు వస్తుంటాయి. తాజాగా కూడా ఒడిశాలో ఇదే రిపీట్ అయ్యింది. ఒడిశా రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఆదివాసి నేత అయినటువంటి మోహన్ చరణ మాఝి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలంతా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం మంగళవారం ప్రకటించింది. సీఎంగా ఎన్నికవడంతో మోహన్ చరణ మాఝి ఆనందం వ్యక్తం చేశారు. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.


ఈ విషయం మీడియాలో వచ్చిన తరువాత దేశమంతా తెలిసింది. ఈ వార్త చూసిన ఆయన కుటుంబ సభ్యులు మొదటగా ఆశ్చర్యపోయారు. ఆ తరువాత సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి ఓ సందర్భం ఒకటి వస్తుందని తాము ఎప్పుడూ కూడా ఊహించలేదంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: ఓట్ల కోసమే రామమందిరం నిర్మాణం.. శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు


సీఎంగా ఎన్నికైన మోహన్ సతీమణి ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒడిశాకు కొత్త ముఖ్యమంత్రి ఎవరో వస్తారని అనుకున్నాం.. కానీ, నా భర్త సీఎం అవుతారని నేనెప్పుడు ఊహించలేదు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించాం.. కానీ, సీఎంగా ఎన్నికయ్యారు. ఈ విషయం టీవీలో చూస్తే గానీ తెలియలేదు. ఇది మాకు చాలా గొప్ప విషయం. రాష్ట్ర ప్రజల సంక్షేమం దిశగా ఆయన పాలన ఉంటుందని భావిస్తున్నాను’ అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

అదేవిధంగా మోహన్ తల్లి బాలే మాఝి మాట్లాడారు. ఇప్పుడు నా కుమారుడిని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. యువకుడిగా ఉన్నప్పటి నుంచే తోటివారికి సహాయం చేయడంలో ముందుండేవాడు. సర్పంచ్ గా పని చేసిన నా కుమారుడు, తరువాత ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు సీఎం స్థాయికి వచ్చాడు’ అంటూ ఆమె పుత్రోత్సాహం పొందారు.

Also Read: Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్..

అయితే, మోహన్ స్వస్థలం రైకలా. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

1997 నుంచి 2000 వరకు మాఝి సర్పంచిగా సేవలందించారు. కేంఝర్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 నుంచి 2024 వరకూ ఆయన శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్ విప్ గా పనిచేశారు.

Tags

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×