New Delhi Railway Station Stampede Updates: న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించినట్టు సమాచారం. కేవలం ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాటలే కాకుండా మిగతా కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు ఢిల్లీ పోలీసులు. తొలుత స్టేషన్‌లో ఉన్న సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.
మృతులు ఏ ప్రాంతానికి చెందినవారు?
ప్రాణాలు కోల్పోయిన 18 మందిలో 14 మంది మహిళలు ఉన్నారు. తొక్కిసలాట ఘటనలో మృతులు ఎక్కువగా ఢిల్లీ, బీహార్ ప్రాంతానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. బీహార్ కు చెందినవారు 9 మంది ఉన్నారు. అలాగే ఢిల్లీకి చెందినవారు 8 మంది కాగా, హర్యానా ప్రాంతానికి చెందినవారు ఒకరు ఉన్నారు.
మృతుల వివరాలు జాబితాను పోలీసులు బయటపెట్టారు. ఆహాదేవి, పింకి దేవి, షీలా దేవి, వ్యోమ్ పూనమ్ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణ దేవి, విజయ్ మృతులు: నీరజ్, శాంతిదేవి, పూజాకుమార్, పూనమ్, సంగీతామాలిక్, మమతాఝా, రియాసింగ్, బేబీకుమారి, మనోజ్ ఉన్నారు.
ఇదిలావుండగా మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది భారతీయ రైల్వే. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, అదనపు భద్రతా బలగాలను మొహరించినట్టు అధికారులు చెప్పుకొచ్చారు.
ALSO READ: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో అసలేం జరిగింది? సాక్షుల వెర్షన్ మరోలా.. ఎందుకు?
నేతల రియాక్షన్స్
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 14 మంది మహిళలు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట కారణంగా అనేక మంది మరణించడం, అనేకమంది గాయపడ్డారు. ఇది చాలా బాధాకరమైనదని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. మరోవైపు ఈ ఘటన రైల్వే వైఫల్యాన్ని, ప్రభుత్వ ఆవేదనను మరోసారి బయటపెట్టిందన్నారు. ప్రయాగ్‌రాజ్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నందున, స్టేషన్‌లో మెరుగైన ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. నిర్వహణ లోపం, నిర్లక్ష్యం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వం, యంత్రాంగం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రియాక్ట్ అయ్యారు. తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమన్నారు. స్టేషన్ నుండి బయటకు వస్తున్న వీడియోలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయని తెలిపారు. మృతుల వ్యవహారంలో మోడీ ప్రభుత్వం నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇది అత్యంత సిగ్గుచేటు, ఖండించదగినదిగా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఈ ఘటనలో తప్పిపోయిన వారి గుర్తించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూనే, క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించేందుకు ఆరోగ్య సదుపాయాలు కల్పించాలన్నారు.
ఢిల్లీ ఆపద్ధర్మ సీఎం అతిషి ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. మహా కుంభ మేళాకు వెళ్తున్న భక్తులకు ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం కానీ ప్రజల భద్రత గురించి పట్టించుకోలేదన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఎలాంటి ఏర్పాట్లు లేవని, వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం సరైన వసతులు ఏర్పాటు చేయలేదన్నారు.
नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ मचने से कई लोगों की मृत्यु और कईयों के घायल होने की ख़बर अत्यंत दुखद और व्यथित करने वाली है।
शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।
यह घटना एक बार फिर रेलवे की नाकामी और सरकार…
— Rahul Gandhi (@RahulGandhi) February 16, 2025