BigTV English

New Fastag Rules: నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. వీటిని అప్డేట్ చేయకుంటే జేబుకు చిల్లే!

New Fastag Rules: నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్.. వీటిని అప్డేట్ చేయకుంటే జేబుకు చిల్లే!

FASTag New Rules from Today: వాహనాల ఫాస్టాగ్‌కు సంబంధించిన కొత్త రూల్స్‌ ఆగస్ట్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్‌ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ చేయించుకుకోవాలి. లేకుంటే టోల్‌ ప్లాజాల వద్ద చిక్కులు తప్పవు.


వాహనాల ఫాస్టాగ్‌కు సంబంధించిన కొత్త రూల్స్ ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ  చేసిన నూతన మార్గదర్శకాలు ప్రకారం.. ఫాస్టాగ్ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

టోల్ ప్లాజాల వద్ద ఇబ్బంది కలగకూడదంటే ఫాస్టాగ్ చేయించుకోవాలని, లేని సమక్షంలో టోల్ ప్లాజాల వద్ద చిక్కులు తప్పవని చెప్పింది.  అయితే గత మూడేళ్లలో తీసుకున్న ప్రతీ ఫాస్టాగ్ కు తప్పనిసరిగా కేవైసీ అప్ డేట్ చేయించుకోవాలని సూచించింది. ఐదేళ్ల కంటే పాత ఫాస్టాగ్‌లను రీప్లేస్ చేయించుకోవాల్సిందేనని ఎన్‌పీసీఐ ఉత్తర్వులను జారీ చేసింది.


అయితే కొత్త నిబంధనల ప్రకారం.. ఇక నుంచి ఫాస్టాగ్‌లన్నీ తప్పకుండా వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌తో లింక్ అయి ఉండాలని పేర్కొంది. కొత్తగా వాహనాలు కొనేవారు తమ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను 90 రోజులలోగా అప్డేట్ చేయించుకోవాలి. ఈ వివరాలను ఫాస్టాగ్ జారీ చేసే కంపెనీలు వేగంగా పరిశీలించి డాటాబేస్‌లో సమాచారాన్ని మార్పు చేయాలి. ఈ ప్రక్రియ అక్టోబర్ 31 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

Also Read: మణిపూర్ అల్లర్ల మూల్యం రూ.500 కోట్లు

ఫాస్టాగ్ జారీ చేసే కంపెనీలకు వాహనదారులు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సమాచారాన్ని అందించాలి. వాహనం ముందు భాగం, వెనుక భాగానికి సంబంధించిన స్పష్టమైన ఫొటోలను ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్‌కు అందించాలి. దీంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని గుర్తించేందుకు సులభంగా ఉండే అవకాశం ఉంటుంది.

Related News

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Rahul Mamkootathil: సినీ నటి ఆరోపణలు.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్

Heavy Rains: దేశాన్ని వణికిస్తున్న వాన బీభత్సం.. విద్యాసంస్థలకు సెలవులు

Delhi News: ఢిల్లీ సీఎం రేఖాపై దాడి కేసు.. తీగలాగితే డొంక కదులుతోంది, కొత్త విషయాలు బయటకు

BJP New Chief: బీజేపీ కొత్త అధ్యక్షులెవరు? ఈసారి ఉత్తరాదికే ఛాన్స్

Big Stories

×