Hyderabad: హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఎగుమతి చేస్తున్న బియ్యంపై ఫోకస్ చేసింది అమెరికా ఎఫ్‌డీఏ-FDA. ఆ రైస్‌లో పురుగుమందుల అవశేషాలు ఉండడంతో రెడ్ లిస్ట్‌లో చేర్చింది. దీనివల్ల ఆ సంస్థ ఉత్పత్తులను తనిఖీ లేకుండానే నిలిపివేసే అధికారం FDA అధికారులకు లభిస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఎగుమతి చేస్తున్న బియ్యం ఉత్పత్తులపై అమెరికా ఆహార-ఔషధ నియంత్రణ సంస్థ నిఘా పెట్టింది. ఆ సంస్థకు చెందిన పలు రకాల బియ్యం ఉత్పత్తులను హెచ్చరిక జాబితాలో చేర్చింది. దీంతో ఈ ఉత్పత్తులు అమెరికా పోర్టుకు చేరిన వెంటనే టెస్టు చేయకుండా వాటిని అధికారులు నిలిపి వేయవచ్చు.
ఎగుమతి చేసిన బియ్యం ఉత్పత్తులలో క్లోర్‌పైరిఫాస్ అనే పురుగుమందు అవశేషాలు ఉన్నట్లు FDA గుర్తించింది. సెప్టెంబర్ 15న FDA Import Alert 99-08లోని భారత్‌కు సంబంధించిన రెడ్ లిస్ట్‌లో ఆ రైస్ చేర్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రాసెస్‌డ్ ఆహార ఉత్పత్తులకు హెచ్చరిక వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ సంస్థకు చెందిన బియ్యంలో క్లోర్‌పైరిఫాస్ అనే పురుగు మందును ప్రత్యేకంగా ప్రస్తావించింది.
FDA రికార్డుల్లో ఆ సంస్థ కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీ చిరునామాతోపాటు సికింద్రాబాద్ పేరిట మరో చిరునామా ఉంది. ప్రాసెస్ చేసి ప్యాకింగ్ జాస్మిన్ రైస్, ప్యాకేజ్డ్ రైస్ ఉన్నాయి. ఈ రెండు ఉత్పత్తులను వైట్ రైస్‌గా పేర్కొంది. వాటికి సంబంధించి పురుగుమందుగా క్లోర్ పైరిఫాస్‌ను నమోదు చేసింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న రికార్డుల్లో బియ్యం ఏ బ్రాండ్ పేరుతో విక్రయించింది? ఏ బ్యాచ్‌కు చెందినది అనే వివరాలు వెల్లడించలేదు.
ఎంత పరిమాణంలో బియ్యం ఎగుమతి చేశారు? అమెరికాలో దిగుమతి చేసుకున్న సంస్థ ఏది? ఏ పోర్టు వద్ద సరుకు నిలిపివేశారు? నమూనాలను ఎప్పుడు సేకరించారు అనే సమాచారం లేదు. బియ్యంలో క్లోర్‌పైరిఫాస్ ఎంత మోతాదులో ఉన్నట్లు గుర్తించారనే వివరాలు ప్రస్తావించలేదు. తెలంగాణ నుంచి అమెరికాకు భారీగా బియ్యం ఎగుమతి అవుతుంది. అందులో తెలంగాణ సోనా-RNT-9001, బాస్మతీ రకాలకు అక్కడి భారతీయుల్లో మంచి డిమాండ్ ఉంది.
ALSO READ: శ్రీమంతుడులా వచ్చి సిరిసిల్లలో పడ్డాడు.. కేటీఆర్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!
బారత్ నుంచి అమెరికాకు ఏటా సుమారు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఎగుమతి అవుతోంది. అందులో హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఏటా సుమారు 40 వేల నుంచి 50 వేల టన్నుల వరకు బియ్యం యూఎస్‌కు ఎగుమతి అవుతోంది.