BigTV English

Omicron BF 7 : సెకండ్ వేవ్ లాగా ఒమిక్రాన్ బిఎఫ్7 చుట్టుముడితే పరిస్థితి ఏంటి..?

Omicron BF 7 : సెకండ్ వేవ్ లాగా ఒమిక్రాన్ బిఎఫ్7 చుట్టుముడితే పరిస్థితి ఏంటి..?

Omicron BF 7 : చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావంపై చర్చించారు. వైద్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. పండగల సీజన్ మొదలైనందున కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మహమ్మారి వ్యాప్తికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే మాస్కులు, శానిటైజర్ల వినియోగాన్ని తప్పని సరి చేయాలని వైద్య అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశంలో సూచించారు.


కరోనా వేరియంట్ బీఎఫ్-7తో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ కోరారు. తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. శానిటైజర్లు వాడాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కేంద్రమంత్రి సూచించారు. ప్రపంచ దేశాల్లో మహమ్మారి విజృంభనను గమనిస్తున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కొవిడ్​ మహమ్మారి పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లోక్​సభలో ప్రకటన చేశారు. చైనాలో కొవిడ్​ కేసులు, మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలో మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం చురుగ్గా వ్యవహరిస్తోందన్నారు. మహమ్మారిపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేసిందన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220 కోట్ల వ్యాక్సిన్​ డోసులు అందించామన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్​పోర్టుల్లో కరోనా టెస్టులు చేస్తామన్నారు కేంద్ర మంత్రి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
బైట్ కేంద్రమంత్రి మాండవీయ


మరోవైపు ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ భారత్‌లోనూ బయటపడింది. తొలి కేసును గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్‌లోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా బీఎఫ్‌-7 వేరియంట్ కేసులు ఇప్పటివరకు 4 నమోదైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అందులో 3 గుజరాత్‌లో నమోదు కాగా.. మరో కేసు ఒడిశాలో వెలుగుచూసినట్లు పేర్కొన్నాయి. ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అధికారులకు సూచించింది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌ టెస్టింగ్‌ను ప్రారంభించింది. మరో వారం రోజుల్లో క్వారంటైన్‌, టెస్టింగ్‌ల కోసం మౌలిక సదుపాయాలు మరోసారి ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. చైనా, అమెరికా, దక్షిణాఫ్రికా, జపాన్‌లో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా ఉన్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్ 17 కొత్త వేరియంట్ పుట్టుకురావడంతో ఈ కేసులను గుర్తించి చికిత్స చేయడానికి వైద్యులకు, పరిశోధకులకు తలనొప్పిగా మారింది. భారత్‌లో కరోనా కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ.. సెకండ్ వేవ్ లాగా ఒకే సారి కరోనా కేసులు భారత్‌ను చుట్టుముడితే పరిస్థితి ఏంటని పలువురిలో ఆందోళన మొదలైంది.

Tags

Related News

CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్

Rahul Gandhi: ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్

National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!

Rare disease: హడలెత్తిస్తున్న అరుదైన వ్యాధి.. పాపం చిన్నారి మృతి.. బీ అలర్ట్!

Save Delhi Dogs: ఈ ఆపరేషన్ చేస్తే వీధికుక్కల బెడద ఉండదు.. సేవ్ ఢిల్లీ డాగ్స్ పేరుతో పెట్ లవర్స్ ర్యాలీ

Marwari Community: అసలు మార్వాడీలు ఎవరు? వారి వ్యాపార రహస్యం ఏంటి?

Big Stories

×