BigTV English

Lashkar e Taiba leaders: ఆపరేషన్‌ సింధూర్‌.. లష్కరే తోయిబా కీలక ఉగ్ర నేతల హతం

Lashkar e Taiba leaders: ఆపరేషన్‌ సింధూర్‌.. లష్కరే తోయిబా కీలక ఉగ్ర నేతల హతం

Lashkar e Taiba leaders: భారత్‌ మోస్ట్‌వాంటెడ్‌ లష్కరే తొయిబాకు బిగ్‌ షాక్ తగిలింది. త్రివిధ దళాలు చేపట్టిన మిస్సైల్స్ ఎటాక్‌లో ఆ సంస్థకు చెందిన హెడ్‌ క్వార్టర్స్ నేలమట్టమైంది. మురిద్కేలోని ప్రధాన కార్యాలయంపై దాడి చేశాయి బలగాలు. లాహోర్‌కు 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న మురిద్కేపై గురిచూసి కొట్టాయి. ఈ ప్రాంతంలో లష్కరే తోయిబా కీలక ఉగ్ర నేతల హతం అయ్యారు.  ఇంకా ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ భారీగా నష్టం జరిగినట్లు సమాచారం.


మురిద్కే కేంద్రంగా లష్కరే తొయిబా

మురిద్కేతో పాటు మరో రెండు లష్కరే తొయిబా ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేశాయి భారత బలగాలు. బర్నాలాలోని మర్కాజ్‌ హదిత్‌, ముజఫ్ఫరాబాద్‌లోని షావై నల్ల క్యాంప్‌పై ఎటాక్‌ చేశాయి.మన దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఫస్ట్ విన్పించే పేరు లష్కరే తొయిబా. హఫీస్‌ సయీద్‌ మహ్మద్‌ దీన్ని స్థాపించాడు. 1990 నుంచి ముర్కిదే నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇండియాలోని మెట్రో నగరాల్లో దాడులు సృష్టించడం ఈ సంస్థ పని.


26/11 ముంబై ఎటాక్‌లో హఫీజ్‌ సయీద్ మాస్టర్‌మైండ్‌

26/11 ఎటాక్ గుర్తుందా ? పాక్‌కు చెందిన ముష్కరమూక తాజ్‌ హోటల్‌లో సృష్టించిన నరమేథం ఇంకా ఎవరూ మరిచిపోలేదు. 2008లో జరిగిన ముంబై పేలుళ్లలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మాస్టర్ మైండ్‌ హఫీజ్‌ సయీదే. 2008లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అతన్ని అల్-ఖైదా, తాలిబాన్‌లతో సంబంధం ఉన్న వ్యక్తిగా గుర్తించి ఆంక్షలు కూడా విధించింది. అమెరికా 2012లో అతనిపై 10 మిలియన్ డాలర్ల రివార్డ్ సైతం ప్రకటించింది.

2020లో ఉగ్రవాద కేసుల్లో దోషిగా తేలిన హఫీజ్‌

2020లో పాకిస్థాన్ యాంటీ-టెర్రరిజం కోర్టు అతన్ని ఉగ్రవాద ఆర్థిక సహాయం కేసుల్లో దోషిగా నిర్ధారించి 78 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అతను ప్రస్తుతం పాకిస్థాన్ కస్టడీలో ఉన్నాడు. ప్రపంచానికి తమ కస్టడీలో ఉన్నాడని చెబుతున్న పాక్‌.. హై సెక్యూరిటీ కల్పించింది. ఇటీవల వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

2017లో మిల్లీ ముస్లిం లీగ్‌ పార్టీ స్థాపన

సయీద్ 2017లో మిల్లీ ముస్లిం లీగ్‌ రాజకీయ పార్టీని స్థాపించాడు. అమెరికా దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించడంతో దీనిని నిషేధించారు. 2018 ఎన్నికల్లో అతను అల్లా-ఓ-అక్బర్ తెహ్రీక్ పార్టీకి మద్దతు ఇచ్చాడు, కానీ విజయం సాధించలేదు. అతని కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల పహల్గామ్‌ ఉగ్రదాడిలోనూ సయీద్ సూత్రధారిగా ఉన్నాడు.

ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు బిగ్‌షాక్‌

ఇటు జైషే మహ్మద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా మిస్సైల్స్‌ దాడుల్లో…ఈ ఉగ్రసంస్థకు చెందిన నాలుగు క్యాంపులు ధ్వంసమయ్యాయి. బహవల్‌పూర్‌లోని జైషే మహ్మద్‌ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు కోట్లిలోని మర్కాజ్‌ అబ్బాస్‌, ముజఫ్పరాబాద్‌లోని సెద్నా బిలాల్ క్యాంపు, టెహ్రా కలాన్‌లోని సర్జాల్ క్యాంపులపై ఎటాక్ చేసింది.

భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌గా మసూద్ అజార్‌

మన దేశంలో జరిగిన ప్రతి ఉగ్రదాడుల్లో… జైషే మహ్మద్‌..! హస్తం ఉంది. పాక్‌లో ఆశ్రయం పొందుతూ, భారత్‌లో నరమేథం సృష్టించడమే ఈ టెర్రరిస్టు గ్రూపు పని. పాక్ ఆర్మీ, ISI అండదండలతో రెచ్చిపోతూ దాడులు చేస్తూ వస్తోంది. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు ఇండియా అంటే నరనరాన ద్వేషం. భారత్‌లో ఉగ్రదాడులతో అశాంతి సృష్టించడమే పని. 2000లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడింది ఈ ఉగ్రమూకనే. 2002లోనే దీన్ని బ్యాన్‌ చేశారు. అది జస్ట్ పేపర్‌పై మాత్రమే. మసూద్‌ అజార్‌ మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నాడు. భారత్‌కు అప్పగించాలంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాక్‌ పట్టించుకోలేదు. పైగా అతడికి ఆశ్రయమిస్తూ, అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తోంది.

2016 పఠాన్‌కోట్‌లోని IAF స్థావరంపై దాడి

2016లో పఠాన్‌కోట్‌లోని IAF స్థావరంపై దాడి, 2019లో పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత జైషే మహ్మద్‌, దాని చీఫ్‌ మసూద్‌ అజార్‌ ఇండియా హిట్‌ లిస్టులో ఉన్నాడు. బహవాల్‌పూర్‌ కేంద్రంగా ఓ క్యాంపును ఏర్పాటు చేశాడు. పేరుకు మసీదు. కానీ అక్కడ జరిగేవన్నీ ఉగ్రవాద కార్యకలాపాలే. రెచ్చగొట్టే స్పీచ్‌లతో యువతను ఎట్రాక్ట్ చేసి, ఉగ్రవాదులుగా తయారు చేయడమే పని. ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్‌, ట్రైనింగ్‌, వారికి ఫండ్స్‌ ఇవ్వడం అన్ని జేషే మహ్మద్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచే జరుగుతాయి.

Also Read: మాక్ డ్రిల్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం..

ప్రారంభోత్సవానికి హమాస్‌ నేతల హాజరు

మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జైషే మహ్మద్‌ క్యాంపును ఇటీవలే పునర్నిర్మించారు. దీని ప్రారంభోత్సవంలో హమాస్‌ నేతలు, పాక్‌ ఆర్మీ చీఫ్ మునీర్‌ పాల్గొనడం అప్పట్లో సంచలనం రేపింది. 2019 నుంచి జేషే మహ్మద్‌ హెడ్ క్వార్టర్స్‌పై భారత్ నిఘా ఉంది. టెర్రర్ ట్రైనింగ్‌కు సంబంధించి పక్కా ఆధారాలు కూడా సేకరించింది. ఐతే పహల్గామ్ దాడి తర్వాత…ఎటాక్‌ చేయాలని నిర్ణయానికి వచ్చింది. రాత్రి మిస్సైల్స్‌తో దాడి చేసి నేలమట్టం చేసింది.

Related News

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×