Operation Sindoor live updates: ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. దేశంలో ఇంధన కొరత లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రజలకు హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు, సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. ఎటువంటి భయాందోళనలకు గురికావలసిన అవసరం లేదని, అన్ని అవుట్‌లెట్‌లలో ఇంధనం, LPG తక్షణమే అందుబాటులో ఉన్నాయని తమ ఎక్స్ వేదికగా వెల్లడించింది. యుద్ధ భయంతో ప్రజలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ డీలర్ల వద్దకు పెద్ద ఎత్తున వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది.
భారతదేశంలోని కాశ్మీర్ ను లక్ష్యంగా చేసుకొని, పాకిస్తాన్ చేస్తున్న అన్ని మిస్సైల్స్‌ను భారత ఆర్మీ విజయవంతంగా కూల్చేస్తోంది. ఇది భారతదేశం యొక్క అత్యాధునిక రక్షణ వ్యవస్థల సమర్థతను చూపిస్తుంది.
పాకిస్తాన్ మిస్సైల్ దాడులు – భారత ఆర్మీ ప్రతిస్పందన
పాకిస్తాన్ నుండి వచ్చిన మిస్సైల్స్ భారతదేశంలో ఉన్న కాశ్మీర్ ను లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ట్రాక్ చేసి, కూల్చివేసింది. భారత ఆర్మీ, ఆధునిక రాడార్ వ్యవస్థలను ఉపయోగించి, మిస్సైల్స్‌ను త్వరగా గుర్తించి, వాటిని మట్టి కరిపించింది.
పాకిస్తాన్‌పై భారత ప్రతీకార చర్యలు
భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడులతో కరాచీ పోర్ట్ దద్దరిల్లింది. ఏడు భారీ పేలుళ్లతో అక్కడ మంటలు ఎగసిపడినట్లు ప్రాథమిక సమాచారం. దాడిలో పాక్ నౌకాదళానికి చెందిన 10 నౌకలు పూర్తిగా ధ్వంసమైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
పాక్ ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో పేలుడు
ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆయనను అత్యవసరంగా సురక్షిత బంకర్లోకి తరలించినట్లు సమాచారం. అధికారికంగా దీనిపై ఇంకా ప్రకటించలేదు గానీ, ఇది పాక్ పాలక వర్గంలో తీవ్ర ఉలికిపాటుకు దారితీసింది.
రాత్రికి రాత్రే భారత్ తీవ్ర హెచ్చరికలు..
ఈ దాడులతో భారత్ పాకిస్తాన్‌కు మరింత లోతైన ప్రతీకారం తీర్చేందుకు సిద్ధంగా ఉందని, రక్షణ రంగ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ చేస్తున్న గగనతల దాడులు, డ్రోన్ చొరబాట్లకు భారత భద్రతా వ్యవస్థ చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంది.
భారత విమానయాన ప్రయాణికులకు కీలక సూచనలు
భద్రతాపరంగా తీసుకుంటున్న జాగ్రత్తల కారణంగా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) మార్గదర్శకాలను అనుసరించి, భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు తమ ఫ్లైట్ షెడ్యూల్ కంటే కనీసం 3 గంటల ముందుగా చేరాల్సిందిగా ఎయిర్ ఇండియా సూచించింది. చెక్-ఇన్, బోర్డింగ్ లను సజావుగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
అనుసరించి, భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు తమ ఫ్లైట్ షెడ్యూల్ కంటే కనీసం 3 గంటల ముందుగా చేరాల్సిందిగా ఎయిర్ ఇండియా సూచించింది. చెక్-ఇన్, బోర్డింగ్ లను సజావుగా నిర్వహించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
కరాచీలో మన సేన
భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఓ కీలక మైలురాయిని అధిగమించింది. కరాచీ పోర్ట్‌పై నిశ్శబ్దంగా కాని శక్తివంతంగా దాడి చేసి, పాక్ సముద్ర ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ కొట్టింది. ఈ దాడిలో పాక్ నౌకాదళానికి చెందిన పలు సర్వీస్ షిప్స్ ధ్వంసమయ్యాయని నిఘా వర్గాలు తెలిపాయి.
ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి సునామీ
భారత నౌకాదళానికి చెందిన INS Vikrant నుండి ప్రయోగించిన అధునాతన క్షిపణులు, హై-టెక్ డ్రోన్లతో కరాచీ పోర్ట్ లక్ష్యంగా దాడులు జరిపారు. ఓ దశలో ఏకంగా ఏడు భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దాంతో పోర్టు ఆవరణంలో మంటలు ఎగసిపడుతూ, ఆస్తి నష్టం విపరీతంగా సంభవించినట్టు తెలుస్తోంది.
Big Breaking: భారత నౌకాదళం చేపట్టిన శక్తివంతమైన ప్రతీకార చర్యతో పాకిస్తాన్‌కు గట్టి దెబ్బ తగిలింది. భారత నౌక INS విక్రాంత్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, హై-టెక్ డ్రోన్లతో కరాచీ పోర్ట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ దాడిలో ఏడు భారీ పేలుళ్లు సంభవించగా, మంటలు ఆకాశాన్నంటాయి.
పోర్ట్ ఆవరణలో ఉన్న పాక్ నౌకాదళానికి చెందిన 10 నౌకలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్ సముద్ర ఆర్థిక వ్యవస్థకు ఇది తీవ్రమైన నష్టం కలిగించే ఘటనగా రక్షణ నిపుణులు భావిస్తున్నారు.
ఆ ఎయిర్ పోర్ట్ లు మూసివేత..
పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో భారత్ కీలక రక్షణాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఉత్తర భారత దేశంలో 27 ఎయిర్‌పోర్టులను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆంక్షలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఈ చర్యలతో దేశవ్యాప్తంగా ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడింది. మొత్తం 430 విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. విమానాశ్రయాల్లో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా మరిన్ని విమానాశ్రయాల్లో కూడా మార్పులు ఉండే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పాకిస్తాన్ కు మరో గట్టి దెబ్బ..
పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా ప్రాంతంలో భారీ దాడి చేసింది. నిఘా వర్గాల సమాచారం మేరకు, బలుచిస్తాన్ తీవ్రవాదులు అత్యాధునిక ఆయుధాలతో సాయుధ దళాల స్థావరంపై హఠాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో పలు సైనికులు గాయపడినట్లు తెలుస్తున్నా, పాక్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇది ఇప్పటివరకు బిఎల్ఏ చేసిన అతి పెద్ద దాడిగా భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి. ఓ వైపు మన దేశం నుండి గట్టి ఎదురు దెబ్బలు తింటున్న పాక్ కు ఇది కోలుకోలేని దెబ్బగా చెప్పవచ్చు.
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన.. తప్పక పాటించండి
భారతదేశంపై పాకిస్తాన్ ఇప్పుడు ఓ కొత్త విధానంతో దాడికి సిద్ధమవుతోందని ఇండియన్ ఆర్మీ హెచ్చరించింది. ఇది ఎటువంటి ప్రత్యక్ష పోరాటం కాకుండా.. సైబర్ యుద్ధం రూపంలో ఉంటుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గలీజ్ దేశంగా పేరుపొందిన పాకిస్తాన్, ఇప్పుడు సైబర్ దాడులకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అజ్ఞాత నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింక్‌లు లేదా ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేయవద్దని, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ తరహా దాడులు వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డేటా లేదా దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశముందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ హెచ్చరించింది.
బ్రేకింగ్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అరెస్టు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను పాకిస్తాన్ సైనిక అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యంలో అంతర్గత విభేదాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ అరెస్టు జరిగిందని తెలుస్తోంది.
బ్రేకింగ్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అరెస్టు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను పాకిస్తాన్ సైనిక అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యంలో అంతర్గత విభేదాలు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ అరెస్టు జరిగిందని తెలుస్తోంది.
మరో 2 డ్రోన్స్ కూల్చివేసిన సైన్యం
జమ్మూ కాశ్మీర్‌లో భారత సైన్యం మరోసారి తన సత్తా చాటింది. పాకిస్తాన్‌కు చెందిన మరో రెండు డ్రోన్లను భారత బలగాలు గుర్తించి కూల్చివేశాయి. ఈ డ్రోన్లు గూఢచారితనం కోసం భారత భూభాగంలోకి ప్రవేశించగా, సరిహద్దు వద్ద భద్రతా బలగాలు వాటిని వెంటనే పసిగట్టి కూల్చాయి.
ఇస్లామాబాద్ స్మాష్..
భారత సైన్యం ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని కీలక ప్రాంతాలపై డ్రోన్ దాడులు నిర్వహించింది. తాజా సమాచారం మేరకు, ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులు పాక్ సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకొని జరిగినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి ప్రయోగించిన అత్యాధునిక డ్రోన్లు, లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
శభాష్ సేన..
మన భద్రతా బలగాలు మరోసారి తమ సాహసాన్ని, శౌర్యాన్ని చాటాయి. పాక్ నుండి వస్తున్న ముప్పులకు ధీటుగా ప్రతిస్పందిస్తూ, భారత సైన్యం సరిహద్దులపై దృఢమైన చర్యలు చేపట్టింది. ఇది కేవలం ప్రతీకారం కాదు, దేశ భద్రత కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నందుకే సైనికులు మరోసారి జై హింద్ అనే గళంతో ముందుకు వచ్చారు.
జమ్మూ కాశ్మీర్‌లో పాక్ డ్రోన్లను కూల్చివేయడం, పాక్ సరిహద్దులో కీలక నగరాలపై భారత్ డ్రోన్ దాడులు చేయడం, కరాచీ పోర్ట్, లాహోర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్‌లపై ప్రతీకార చర్యలన్నీ పాక్‌కు గట్టి హెచ్చరికలే.
పాకిస్తాన్ రెచ్చగొట్టే దూకుడు చూపిస్తే, మన దేశం ప్రతిసారి బుద్ధి చెప్పే తీరు పాటిస్తోంది. ఇప్పుడు సైన్యం చూపించిన ప్రతీకార ధైర్యం దేశ ప్రజల మనసుల్లో గర్వం నింపుతోంది. ఎన్‌ఎస్‌జీ, వాయుసేన, నౌకాదళం, భద్రతా విభాగాల సమన్వయంతో ఈ ప్రతిదాడులు విజయవంతమయ్యాయి. దేశంలో ప్రతి పౌరుడి గుండె గర్వంతో నిండిపోయింది. అందుకే మన సైనికుల పోరాట పటిమకు సెల్యూట్ చేద్దాం. జై హింద్ – శభాష్ సైనిక్!