Dhanashree : ప్రముఖ క్రికెటర్ యజ్వేదర్ చాహల్, ధన శ్రీ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విడాకులకు కారణం ఏమిటని కోర్టు వారిద్దరినీ అడిగినప్పుడు, వారు ‘ఇద్దరి మధ్య అనుకూలత సమస్యలు’ ఉన్నాయంటూ తెలిపారంట. కంపాటబిలిటీ ఇష్యూస్ అంటే ఇద్దరి అలవాట్లు, జీవనశైలి అనుకూలంగా లేకపోవడం, దాని కారణంగా వారిద్దరూ విడాకులు తీసుకొని ఈ సంబంధం నుంచి శాశ్వతంగా విముక్తి పొందారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
Also Read : MI vs PBKS: ఉగ్రవాదుల టెన్షన్…ముంబైలో మ్యాచ్ లు… షాక్ లో పంజాబ్ !
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నటించిన భూల్ చుక్ మాఫ్ సినిమాలోని తాజా సాంగ్ టింగ్ లింగ్ సజ్నా విడుదలై సందడి చేస్తోంది. ఈ సాంగ్ లో క్రికెటర్ మాజీ భార్య ధన శ్రీ వర్మ నటించింది. ఆమె ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. రాజ్ కుమార్ బ్యాచ్ లర్ కావడం.. ధన శ్రీ ఐటెం సాంగ్ లో నటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ధన శ్రీ కూడా హీరోయిన్ సమంతా మాదిరిగా విడిపోయిన తరువాత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తోన్నట్టు తెలుస్తోంది. రాజ్‌కుమార్ రావు పాత్ర తన స్నేహితులు ఏర్పాటు చేసిన సర్‌ప్రైజ్ బ్యాచిలర్ పార్టీకి కళ్ళకు గంతలు కట్టుకుని రావడంతో వీడియో ప్రారంభమవుతుంది. ధనశ్రీ వర్మ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె ఎర్రటి సీక్విన్డ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను హై-స్లిట్ చోలితో జత చేసింది. పాట విడుదలైన వెంటనే చాలామంది ధనశ్రీ నటనను ప్రశంసించారు. ఆమె విడాకుల తర్వాత తిరిగి వచ్చినట్లు అభివర్ణించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక చాహల్ ప్రస్తుతం ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఓ మ్యాచ్ లో కీలకంగా బౌలింగ్ చేసి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. ఈ ఐపీఎల్ లో హ్యాట్రిక్ తీసిన బౌలర్ గా నిలిచాడు చాహల్. పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మొదటి స్థానం పై పోటీ పడుతున్నాయి. నిన్నటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. నిన్న రాత్రి ముంబై ఇండియన్స్ పై గుజరాత్ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పంజాబ్ జట్టు కూడా కాస్త బలంగానే కనిపిస్తోంది. ప్లే చేరుకునే జట్లలో పంజాబ్ కూడా ఉండటం విశేషం.
పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ముల్లాన్ పూర్ వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా పంజాబ్ ఓడిపోతుందని అంతా భావించారు. కానీ యజ్వేంద్ర చాహల్ మ్యాచ్ ని మలుపు తిప్పాడు. కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం 15.1 ఓవర్లలో 95 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అవ్వడం విశేషం. ఈ మ్యాచ్ లో చాహల్ 4 వికెట్లు తీసి కోల్ కతాను కోలుకోలేని దెబ్బతీశాడు. మరోవైపు పంజాబ్ బౌలర్ జాన్సన్ కూడా 3 వికెట్లు తీయడంతో పంజాబ్ సులువుగా విజయం సాధించింది. ఈ సీజన్ లో 112 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకొని రికార్డు సృష్టించింది.