Sircilla Politics: సిరిసిల్ల అంటే సిరులకు నిలయం అని అర్థం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధైర్యం, దైవం కలిసిన ప్రాంతం సిరిసిల్ల అని, 2009 ఎన్నికల్లో కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి నిలబెట్టాడుని గుర్తు చేశాడు. ఆనాడు కేటీఆర్ చావు తప్పి కన్నులొట్టబోయినట్టు సిరిసిల్లలో గెలిచాడు. దీంతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మిషన్ భగీరథ నిధులతో సంతోష్ రావు పదివేల కోట్ల శ్రీమంతుడయ్యాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ బాధితుల జాబితాలో రవీందర్ రావు, సంతోష్ రావు, సౌమ్య రావు పేర్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముంపు బాధితుల ప్యాకేజీ సొమ్మును కొల్లగొట్టి, ముంపులో కొంపపోయిన సంతోష్ రావు పదివేల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగారని సీఏం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎవరి జాగీరు కొల్లగొట్టి ఇదంతా చేశారని నిలదీశారు.
Also read: సత్తుపల్లి టూ ఖమ్మం ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు!
గోదావరి జలాలతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మానేరు ఇసుక, గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రవీందర్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ వేల కోట్లు కొల్లగొట్టారని మండిపడ్డారు. ఇసుక లారీలకు అడ్డువచ్చారనే నాడే దళితులను లారీలతో తొక్కిచ్చి చంపించింది నిజం కాదా అని ప్రశ్నించారు. గతాన్ని గుర్తు చేసుకుంటే ఆనాడు బీఆన్ఎస్ పరిపాలనలో ఎన్నో దారుణాలకు పాల్బడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
Also read: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. రాంరెడ్డికి సీటిచ్చింది అందుకేనా..?
రాబోయే శాసనమండలి ఎన్నికల్లో ఒక పద్మశాలి బిడ్డను శాసనమండలికి పంపించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యాంలు కొట్టుకుపోయి కేసీఆర్ ఇంట్లో నోట్ల కట్టలుగా తేలాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలు 9, 10, 11, 12 పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెట్టడం వల్ల ఇక్కడి రైతులకు గోదావరి జలాలు చేరలేదని అన్నారు. కుటుంబ పాలన కావాలో, ప్రజాపాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. గత పాలకులు పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించారా అని ప్రశ్నించారు. పదేళ్ల సమయం పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించేందుకు సరిపోలేదా అని అన్నారు.
గత పాలకులు పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, బతుకమ్మ చీరల్లో కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు. బతుకమ్మ చీరలకు సంబంధించిన రూ.350 కోట్ల బకాయిలను ప్రజా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం వంటి పథకాలను గత పాలకులు అమలు చేయలేదని అన్నారు. ప్రస్తుతం కోటి ఆరు లక్షల కుటుంబాలకు చెందిన 3 కోట్ల 46 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని, మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లు చెల్లించిందని అన్నారు. ఈ పండుగకు ప్రభుత్వం చిలక చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.20,614 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించామని పేర్కొన్నారు. నేటి పాలనలో శ్రీకాంతాచారి తల్లిని మహిళా కమిషన్ సభ్యురాలిగా, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read: సినిమా రేంజ్‌లో స్కెచ్చేసిన దొంగలు.. ఆర్టీసీ బస్సులో రూ.3 కోట్ల గోల్డ్ మాయం.. కానీ చివరకి..?