E-Paper
Advertisement

యాంకర్ గా  25 ఏళ్ల ప్రస్థానం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సుమ కనకాల!

యాంకర్ గా  25 ఏళ్ల ప్రస్థానం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సుమ కనకాల!
Advertisement

Suma Kanakala: సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అంటే అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. ఈమె మలయాళ అమ్మాయి అయినప్పటికీ తెలుగింటి కోడలుగా అడుగుపెట్టి ఎంతో అనర్గళంగా స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా యాంకర్ గా సుమ ఇండస్ట్రీలో 25 సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె తన జర్నీ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఇది గ్రాడ్యుయేషన్ వేడుకలా ఉంది…

ఇటీవల నిర్వహించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (Don’t Trouble The trouble)సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సుమ కనకాల(Suma Kanakala) సినీ జర్నీ గురించి ఒక ప్రత్యేకమైన ఏవీ ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే సుమ దీని గురించి ప్రస్తావిస్తూ…తన జర్నీ పై ప్రదర్శించిన ఈ ఏవి నన్ను ఎన్నో మధురమైన జ్ఞాపకాలలోకి తీసుకువెళ్లింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు 25 ఏళ్లు పూర్తి కావడం అలాగే ఈ సినిమాకు హోస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన రాజమౌళి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీ మాటలు వింటుంటే నాకు ఇది ఒక గ్రాడ్యుయేషన్ సెర్మనీ లాగా అనిపించిందని తెలిపారు.

నా భర్త రాజీవ్ కనకాల…

Advertisement

ఇక తనకోసం ఈ ప్రత్యేకమైన ఏవీ సిద్ధం చేసిన కార్తికేయతో పాటు వాల్స్ అండ్ ట్రెండ్స్, శ్రేయాస్ గ్రూప్ లక్ష్మీతో పాటు నా టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఏవి తయారు చేయటం కోసం మీరు చేసిన కృషి ముఖ్యంగా దాన్ని నా ప్రోగ్రామ్ షీట్లో దాచిపెట్టి నాకు సర్ప్రైజ్ ఇచ్చే ప్రయత్నం ఎంతో ప్రత్యేకం. స్టూడెంట్ నెంబర్ 1 హీరో ఎన్టీఆర్, నా ప్రియమైన భర్త రాజీవ్ కనకాలకు కూడా ప్రత్యేక అభినందనలు. రాజీవ్ నీతో పాటు ఎంతోమంది గొప్ప వ్యక్తులను పరిచయం చేసిన వ్యక్తివి నువ్వే నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలని తెలిపారు.

Advertisement

నన్ను ఇంతలా ఆదరించిన తెలుగు సినిమా పరిశ్రమకు , తెలుగు సినీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు లేకపోతే నేను ఇక్కడ యాంకర్ గా ఉండేదాన్ని కాదు. ఇక నాకు తెలుగు నేర్చుకునేలా చేసి నన్ను ప్రతి విషయంలోనూ ప్రోత్సహించి ముందుకు నడిపించిన మా అమ్మకు ధన్యవాదాలు . అదేవిధంగా నా పని చేసుకోవడానికి నాకు కావలసిన స్వేచ్ఛను ఇచ్చిన తన కుమారుడు రోషన్ కనకాల అలాగే మానస ఇద్దరికీ కూడా ధన్యవాదాలు అంటూ ఈమె సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ తో పాటు ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రాజమౌళితో కలిసి దిగిన ఫోటోని ఈమె షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: ‘కాఫీవిత్ కరణ్’ షోకు ఎండ్ కార్డ్… కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్!

Related News

జనమంటే సప్తగిరి థియేటర్ యజమానికి ఎందుకంత భయం? మరి ఏ సినిమాలు వేస్తారు?

డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పై మహేష్ బాబు రివ్యూ… ఫహద్ సర్ మీరు అద్భుతం అంటూ!

జిమ్‌లో మంచు విష్ణు కష్టాలు చూస్తే.. ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది!

రవితేజ ఇరుముడి దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్‌లో దూకుడు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

‘పొడుస్తున్న పొద్దుమీద’ ఉంటే.. ప్యారడైజ్ దుమ్మురేపేదా?

బాలీవుడ్ డెబ్యూకి సిద్ధమైన చందు మొండేటి..పూర్తి డీటెయిల్స్ ఇవే!

రణబాలి సెకండ్ డాక్యుమెంటరీ ‘ది హిస్టరీ వుయ్ ఫర్ గాట్’ రిలీజ్!

Big Stories

Advertisement
×