Australia vs Bangladesh: బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs Bangladesh) మధ్య తొలి టెస్ట్ ( Bangladesh tour of Australia, 2026) ఆగస్టు 13వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ అద్భుతంగా రాణిస్తోంది. విజయం దిశగా దూసుకు వెళ్తోంది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా జట్టును 198 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ చేసింది బంగ్లాదేశ్. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించింది. ఆ జట్టులో ఉన్న ఎనిమిది మంది బౌలర్లు బంతులు వేసినా కూడా, బంగ్లాదేశ్ బ్యాటర్లు తలొగ్గలేదు. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్ లో 426 పరుగులు చేశారు బంగ్లా బ్యాటర్లు.
ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ ( Australia vs Bangladesh) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రానించి భారీ స్కోర్ సాధించింది. దాదాపు రెండు రోజులపాటు బంగ్లా క్రికెటర్లు బ్యాటింగ్ చేయగలిగారు. తంజీద్ హసన్ తమీం సెంచరీ చేయగా.. నజ్ముల్ హుస్సేన్ షాంటో 84 పరుగులు సాధించాడు. అటు మిరాజ్ 65 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 138 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ 426 పరుగులు సాధించింది.
మొదటి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటర్ల దెబ్బకు కంగారులు కంగారెత్తిపోయారు. బంగ్లాదేశ్ బ్యాటర్లను, పెవిలియన్ కు పంపేందుకు ఆస్ట్రేలియా చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తం ఎనిమిది మంది బౌలర్లను వాడుకున్నప్పటికీ కూడా… బంగ్లాదేశ్ వికెట్లు పడగొట్ట లేకపోయారు. తమ సొంత గడ్డ అయినప్పటికీ కూడా ఆస్ట్రేలియా బౌలర్లు తేలిపోయారు. ఇండియా, ఇంగ్లాండ్ అలాగే దక్షిణ ఆఫ్రికా అలాంటి జట్లపై అద్భుతంగా రాణించిన కంగారు బౌలర్లు… పసికూన బంగ్లాదేశ్ ను మాత్రం డీల్ చేయలేక విఫలమవుతున్నారు. స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, గ్రీన్, పాట్ కమ్మిన్స్, లయన్, వెబ్ స్టార్, హెడ్, లబుషంగే లాంటి బౌలర్లు వికెట్లు పడగొట్టలేక అవస్థలు పడుతున్నారు.
ఇది ఇలా ఉండగా, ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 198 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 426 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కేవలం 37 పరుగులు మాత్రమే చేసింది ఆస్ట్రేలియా ఇంకా బంగ్లాదేశ్ కంటే 191 పరుగులు వెనుకబడే ఉంది. ఈ లెక్కన ఆస్ట్రేలియా రేపటి వరకు ఆల్ అవుట్ అయ్యాయి ప్రమాదం పొంచి ఉంది. ఇదే జరిగితే ఆస్ట్రేలియా దారుణమైన ఓటమిని చవి చూడడం గ్యారంటీ.