E-Paper
Advertisement

BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!

BSNL బిగ్ ధమాకా ప్లాన్.. రూ. 319 కే 65 రోజుల వ్యాలిడిటీ.. ఇదేం ఆఫర్ బాబోయ్!
Advertisement

BSNL Plan: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు చౌకైన ప్లాన్స్ తీసుకొస్తూ సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ప్రధానంగా తక్కువ బడ్జెట్ లో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునేవారి కోసం బీఎస్ఎన్ఎల్ లో ఎన్నో రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా రూ.319 ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2 నెలలకు పైగా వ్యాలిడితో వచ్చిన ప్లాన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

వ్యాలిడిటీనే పెద్ద అడ్వాంటేజ్..

సాధారణంగా ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో 2 నెలల వ్యాలిడిటీ కావాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ BSNL అందిస్తున్న రూ. 319 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఏకంగా 65 రోజుల వ్యాలిడిటీ పొందే వెసులుబాటు ఉంది. దాదాపు రెండు నెలల పైగా ఎలాంటి రీఛార్జ్ టెన్షన్ లేకుండా హ్యాపీగా టెలికాం సేవలు పొందొచ్చు.

ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే..

Advertisement

ఈ ప్లాన్ ప్రధానంగా ఫ్రీ కాల్స్ కోరుకునేవారిని ఉద్దేశించి బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. 65 రోజుల వ్యాలిడిటీతో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే ప్లాన్ మెుత్తానికి 300 ఎస్ఎంఎస్ లను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. ఇక డేటా విషయానికి వస్తే.. 10GB హై-స్పీడ్ డేటా యూజర్లు పొందొచ్చు. రెండు నెలల వ్యవధిలో ఈ డేటాను ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

అదనపు ప్రయోజనాలు

డేటా, కాలింగ్‌తో పాటు ఇందులో ఫ్రీ కాలర్ ట్యూన్ వెసులుబాటును సైతం బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. కాబట్టి నచ్చిన పాటను యూజర్లు.. తమ కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవచ్చు. మెుత్తంగా చూస్తే డేటాతో పెద్దగా అవసరం లేదని పెద్దవారికి, ఇంట్లో వైఫై ఉన్నవారికి, సెకండ్ సిమ్ యూజర్లకు ఈ ప్లాన్ మెరుగైన ఆప్షన్ గా ఉంటుందని చెప్పవచ్చు.

Advertisement

Also Read: ట్రక్కుల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? ఆ ‘OK’ వెనుక పెద్ద చరిత్రే ఉంది!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ. 319 ప్లాన్‌ను చాలా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ లేదా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి.. నంబర్ నమోదు చేసి రూ. 319 ప్లాన్ ఎంచుకోవచ్చు. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ లోని రీఛార్జ్ సెక్షన్ కు వెళ్లినా.. ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. లేదంటే నేరుగా బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ సెంటర్, రిటైల్ మెుబైల్ షాపులకు వెళ్లినా సరిపోతుంది.

Also Read: 3 రోజుల్లో మ్యాచ్ ఫినిష్ చేసి…టీమిండియా ప్లేయ‌ర్ల‌కు నిద్ర‌లేకుండా చేస్తాం

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×