BigTV English

Operation Sindoor Name: అది పేరు కాదు భావోద్వేగం.. పిల్లలు పుడితే సిందూర్ పేరు పెడుతున్న తల్లిదండ్రులు

Operation Sindoor Name: అది పేరు కాదు భావోద్వేగం.. పిల్లలు పుడితే సిందూర్ పేరు పెడుతున్న తల్లిదండ్రులు

Operation Sindoor Patriotism| జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గామ్‌ ప్రాంతంలో ఏప్రిల్ 22న ప్రకృతిని ఆస్వాదిస్తున్న 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి హత్య చేశారు. ఈ మారణహోమం.. దేశవ్యాప్తంగా భారతీయులకు ఆగ్రహావేశాలు కలిగించింది. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్, ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా “ఆపరేషన్ సిందూర్” పేరిట సైనిక చర్యను చేపట్టి పాకిస్తాన్ భూభాగం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడిలో ఆ స్థావరాలు ధ్వంసం కావడంతో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఈ సైనిక చర్య భారత దేశ ప్రజలలో ఒక కొత్త దేశభక్తి స్పూర్తిని నింపింది. ఈ నేపథ్యం ద్వారా “ఆపరేషన్ సిందూర్” నుంచి ప్రేరణ పొందిన లక్నోకు చెందిన కొంతమంది తల్లిదండ్రులు ఇటీవల తమ ఆడ పిల్లలకు “సిందూర్” అనే పేరు పెట్టారు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషినగర్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఈ నెల 10 నుండి 11 తేదీల మధ్య 17 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారికి “సిందూర్” అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌కే షాహి సోమవారం జాతీయ మీడియాకు తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం పాకిస్తాన్‌కు సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పిన కుషీనగర్‌కు చెందిన అర్చన షాహి చెప్పారు. ఆమె తన కూతురికి ఈ “సిందూర్” అనే పేరు పెట్టినట్లు తెలిపారు. ఆమె మాటల్లో, “పహల్గామ్ దాడి తర్వాత అనేక మంది మహిళలు భర్తలను కోల్పోయారు. ఈ సంఘటనకు ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం గర్వకారణం” అని చెప్పుకొచ్చారు. “ఇప్పుడు ‘సిందూర్’ అనేది కేవలం ఒక పేరు కాదు, ఒక భావోద్వేగం” అని ఆమె చెప్పారు. అందుకే ఆమె తన కూతురికి ఈ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.


Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన

ఇక పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా, తన కోడలైన కాజల్ గుప్తాకు పుట్టబోయే బిడ్డకు “సిందూర్” అనే పేరు పెట్టాలని భావించారు. “26 మంది అమాయకుల ప్రాణాలు పోయిన తరువాత, భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినప్పుడు మన దేశం గర్వపడింది” అని ఆయన చెప్పారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా తన కూతురికి “సిందూర్” అనే పేరు పెట్టినట్లు తెలిపారు. “ఈ పేరు నా కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుంది” అని ఆయన అన్నారు. “మా కూతురు పెద్దయ్యాక ఈ పేరులో ఉన్న నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నాను” అని ఆయన చెప్పారు. “ఆమె భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఎదగాలని మా ఆకాంక్ష” అని ఆయన తెలిపారు.

అస్సాంలో సిందూర్ పేరుతో టీ బ్రాండ్
భారత సైనికుల గౌరవార్థంగా ఒక అస్సాం టీ కంపెనీ తమ బ్రాండ్ పేరుని సిందూర్ ప్రైడ్ అనే నామకరణం చేసింది. 20 ఏళ్లుగా అస్సాంలో అరోమికా టీ కంపెనీ నడుపుతున్న రంజిత్ బరువా అనే బిజినెస్ మెన్ 54 రకాల టీ పౌడర్ ని విక్రయిస్తున్నారు. ఇటీవలే ఆయన ఒక కొత్త టీ పొడిని లాంచ్ చేయాల్సి ఉండగా.. దాని పేరు సిందూర్ ప్రైడ్ అనే పెట్టారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×