Save Delhi Dogs: ఢిల్లీలో వీధి కుక్కల తరలింపుపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. పెట్ లవర్స్, జంతు హక్కుల కార్యకర్తలు ఒక వైపు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు కుక్కల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలు విభిన్న అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ వివాదం క్రమంగా మానవ, జంతు హక్కులు అనే రెండింటి మధ్య సున్నితమైన తేడాను తెరపైకి తీసుకొచ్చింది.
నెక్లెస్ రోడ్డులో సేవ్ ఢిల్లీ డాగ్స్ పేరుతో ర్యాలీ
అయితే.. సేవ్ ఢిల్లీ డాగ్స్ పేరుతో నెక్లెస్ రోడ్డులో జంతు ప్రేమికులు ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో కుక్కలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆసరా అనే యానిమల్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. భారీ డాగ్ లవర్స్ హాజరయ్యారు.
ఢిల్లీ ఎన్‌సీఆర్ నుంచి కుక్కలను తరలించాలన్న..
వీధి కుక్కల దాడులు, రేబిస్ బారినపడి పలువురు మరణించిన ఘటనలపై మీడియా కథనాలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీ ఎన్సీఆర్‌లోని వీధి కుక్కలను డాగ్ షెల్టర్స్‌కు తరలించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 11న తీర్పు ఇచ్చింది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వానికి ఆరు నుంచి ఎనిమిది వారాల గడువు విధించింది సుప్రీంకోర్టు. కుక్కలు మళ్లీ జనావాసాల్లోకి వస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ
అలాగే.. కుక్కల తరలింపును అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవంటూ జంతు ప్రేమికులను హెచ్చరించింది. దీంతో.. ఈ తీర్పు కరెక్ట్ కాదంటూ జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. మరికొందరు నేరుగా కోర్టును ఆశ్రయించారు. ఈ ఆదేశాలను పునః పరిశీలిస్తామని హామీ ఇచ్చిన చీఫ్ జస్టిస్.. ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేశారు.
Also Read: స్థానిక సంస్థల ఎన్నికల కోసం.. కేసీఆర్ మైండ్ గేమ్
ర్యాలీకి భారీగా హాజరైన డాగ్ లవర్స్
ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలనే ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న పిటిషన్లపై ఈనెల 14న సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా నిలుపుదల చేయాలని పిటిషనర్లు కోరగా.. అందుకు ధర్మాసనం తిరస్కరించింది.