BigTV English

PM Modi in Ahmedabad: అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ.. ఘటన ప్రాంతం సందర్శన, బాధితులకు పరామర్శ

PM Modi in Ahmedabad: అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ.. ఘటన ప్రాంతం సందర్శన, బాధితులకు పరామర్శ

PM Modi in Ahmedabad: ఎయిరిండియా విమాన ప్రమాద బాధితులకు.. కేంద్రం అండగా ఉంటుందన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అహ్మదాబాద్‌లో పర్యటించిన పీఎం.. మొదటగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి సహా పలువురు ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు.


 ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై వివరాలను అధికారులు మోడీకి వివరించారు. అనంతరం సివిల్ ఆస్పత్రికి వెళ్లారు ప్రధాని. క్షతగాత్రులను పరామర్శించారు. ఎవరూ అధైర్య పడవద్దని.. ఈ కఠినమైన సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు ప్రధాని మోడీ.

ఈ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక మృత్యుంజయుడు రమేష్‌ను ప్రధానమంత్రి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాద సమయంలో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. టేకాఫ్ అయిన నిమిషం లోపే ప్రమాదం జరిగిందని రమేష్ చెప్పారు. తన ఎదురుగా ఇద్దరు ఎయిర్‌హోస్టెస్, సిబ్బంది ఉన్నారని.. చెప్పాడు. తాను ఎలా బయటపడ్డానో నమ్మశక్యం లేదన్నారు. తాను కూర్చున్న వైపు విమానం బిల్డింగ్‌ను ఢీకొట్టకపోవడం వల్లే బతికి బయటపడ్డానన్నారు.


ఇదిలా ఉంటే.. సాధారణంగా విమాన ప్రమాదాల్లో 35 శాతం యాక్సిడెంట్స్‌ టేకాఫ్‌ సమయంలో లేదంటే.. ఫ్లైట్ గాల్లోకి లేచిన కాసేపటికే జరుగుతుంటాయి. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. ఈ నేపథ్యంలో ప్రమాదానికి అవకాశం ఉండే కారణాలను ఓసారి పరిశీలిస్తే.. నిర్ధిష్టమైన వేగంతో రన్‌వైపై దూసుకెళుతూ, సరైన టైమ్‌లో గాల్లోకి లేస్తేనే టేకాఫ్ సవ్యంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే రన్‌ వేపై గాల్లోకి లేచే సమయంలో విమానం స్పీడు గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలా రయ్యిన దూసుకెళ్లాలంటే ఇంజిన్లు పూర్తి స్థాయిలో శక్తి సామర్థ్యాలతో పని చేయాల్సి ఉంటుంది.

ఇక, ఫ్లైట్ టేకాఫ్ సమయంలో పైలెట్‌, కోపైలెట్ పూర్తి స్థాయిలో కో ఆర్డినేషన్‌తో పనిచేస్తూ సెకన్లలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లైట్ ఫుల్‌ స్పీడుతో గాల్లోకి లేచే సమయంలో రన్‌ వేపై నుంచి వచ్చే గాలి వేగాన్ని క్లియర్‌గా అంచనా వేయగలగాలి. సెన్సార్లు ఈ పనిలో ఉంటాయి. వాటిలో ఏ మాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు.

Also Read: భర్తకోసం వెళ్తున్న నవ వధువు.. అంతలోనే తిరిగిరాని లోకాలకు

విమానం రన్‌ వేపై నుంచి గాల్లోకి లేచే సమయంలో ఫ్లైట్ ఇంజిన్లపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా పక్షులు ఢీకొట్టినా, ఫ్యూయల్‌కు సంబంధించిన పీడనం పడిపోయినా, లేదంటే మరే టెక్నికల్ సమస్యలు ఉదాహరణకు టైర్లు, హైడ్రాలిక్స్‌, ఆటోథ్రాటల్, గాలిని సూచించే పరికరాలు లాంటి వాటిలో ఎక్కడ తేడా కొట్టినా క్షణాల వ్యవధిలో పరిస్థితి చేయి దాటిపోతుంది.

వెదర్‌లో వచ్చే ప్రతికూలతలు సైతం విమాన గమనంపై పెను ప్రభావం చూపిస్తాయి. అనుకూలంగా లేని వాతావరణం, విజిబులిటీ తక్కువగా ఉండడం, కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్‌ లాంటివి జరగడం అప్పుడే టేకాఫ్ అయి సెట్‌ అయ్యేందుకు ప్రయత్నించే ఫ్లైట్‌పై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇవి కూడా ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×