E-Paper
Advertisement

అమృత్ భారత్ 3.0 వచ్చేస్తోంది.. ఈ రైలు ముందు వందేభారత్ కూడా జుజుబీ!

అమృత్ భారత్ 3.0 వచ్చేస్తోంది.. ఈ  రైలు ముందు వందేభారత్ కూడా జుజుబీ!
Advertisement

Amrit Bharat 3.0 to Get AC Coaches: భారతీయ రైల్వేలో సామాన్య ప్రయాణికుల కోసం కీలక మార్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందే భారత్ తరహా అత్యాధునిక సౌకర్యాలతో అమృత్ భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరిన్ని అప్ డేట్స్ తీసుకురాబోతోంది. అమృత్ భారత్ 3.0 ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను తీసుకురాబోతోంది. వీటలో ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వే నిర్ణయించింది. ఇప్పటి వరకు అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ ప్రధానంగా ఏసీ సౌకర్యం లేని సుదూర ప్రయాణికుల రైలుగా కొనసాగుతోంది. జనరల్, స్లీపర్ క్లాస్ కోచ్‌లతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా వీటిని రూపొందించారు. ఇప్పుడు ఏసీ కోచ్‌లు కూడా చేరితే ఈ రైళ్ల ప్రయాణ అనుభవం మరింత సౌకర్యంగా ఉండనుంది.

వందే భారత్ తరహాలో సౌకర్యాలు

అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్‌ ను సాధారణ ఎక్స్‌ ప్రెస్ రైళ్లతో పోలిస్తే వేగం, ప్రయాణికుల సౌకర్యాలు మరింత ఎక్కువగా ఉంటాయి. వందే భారత్ రైళ్లలో కనిపించే కొన్ని అత్యాధునిక ఫీచర్లను దృష్టిలో పెట్టుకుని అమృత్ భారత్ రైళ్లను రూపొందించారు. అయితే, వీటి ప్రధాన లక్ష్యం తక్కువ ధరలో ప్రయాణాన్ని అందించడం. తక్కువ ధరలో మెరుగైన ప్రయాణ సౌకర్యాలను సామాన్యులకు అందించడమే వీటి ఉద్దేశం. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ రైళ్లు ఉపయోగకరంగా మారాయి.

2023లో మొదలైన అమృత్ భారత్ ప్రయాణం

Advertisement

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వే 2023లో ప్రారంభించింది. అప్పటి నుంచి వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 60కి పైగా అమృత్ భారత్ రైళ్లు దేశంలోని వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నాయి. సాధారణ ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటి కంటే మెరుగైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణాన్ని అందించే రైలుగా అమృత్ భారత్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రయాణికులకు ఇవి ఉపయోగపడుతున్నాయి.

తక్కువ ఛార్జీ.. ఎక్కువ ప్రయోజనం

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణ ఛార్జీలను అందుబాటులో ఉండేలా నిర్ణయించడం మరో ప్రత్యేకత. స్లీపర్ క్లాస్‌లో సుమారు ప్రతి 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.500 వరకు ఛార్జీ ఉండేలా రేట్లను నిర్ణయించారు. సుదూర ప్రయాణం చేయాల్సిన వారికి ఈ ధరలు అనుకూలంగా ఉంటాయి.

అమృత్ భారత్ 3.0లో ఏసీ కోచ్‌లు

Advertisement

ఇప్పుడు రైల్వే అమృత్ భారత్ 3.0పై దృష్టి పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్న కొత్త వెర్షన్‌లో ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో ఇప్పటివరకు నాన్-ఏసీ ప్రయాణానికి పరిమితమైన అమృత్ భారత్ రైళ్లలో మరింత విస్తృతమైన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి రావచ్చు. ఏసీ కోచ్‌లు చేరితే వేసవి, సుదూర ప్రయాణాల్లో ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

Read Also: డీజిల్‌కు గుడ్‌బై.. భారత్‌లో 35 హైడ్రోజన్ రైళ్లు.. వామ్మో.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!

Tags

Related News

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

వేల అడుగుల లోయలు.. వందల మలుపులు.. ఈ రోడ్లపై డ్రైవింగ్ చాలా డేంజరస్!

నిన్న లీగల్ నోటీసులు.. నేడు భూముల లెక్కలు.. స్వర్ణగిరి ఆలయానికి షాక్ మీద షాక్!

పిడుగు దెబ్బకు ఇండిగో విమానం డ్యామేజ్.. లక్నోలో సేఫ్‌గా ల్యాండింగ్, ఎలా జరిగింది?

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

Big Stories

Advertisement
×