E-Paper
Advertisement

లుక్ అదుర్స్..వర్క్ నెక్స్ట్ లెవెల్! ఫోన్‌తో.. కంట్రోల్ చేసే స్మార్ట్ వాషింగ్ మెషీన్

లుక్ అదుర్స్..వర్క్ నెక్స్ట్ లెవెల్! ఫోన్‌తో.. కంట్రోల్ చేసే స్మార్ట్ వాషింగ్ మెషీన్
Advertisement

LG 9 kg front load washing machine: ఇంటి పనులను ఈజీగా మార్చడంలో.. లేటెస్ట్ హోమ్ అప్లయన్సెస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా.. బట్టలు ఉతకడంలో.. వస్తున్న కొత్త టెక్నాలజీలు, పనిని ఎంతో తేలిక చేశాయి. క్వాలిటీకి మారు పేరైన ఎల్‌జీ నుంచి వస్తున్న ప్రీమియం వాషింగ్ మెషీన్ ప్రస్తుతం మార్కెట్లో.. ట్రెండింగ్‌లో ఉంది. రూ.41,490 ధరలో లభించే ఈ స్మార్ట్ వాషింగ్ మెషీన్, ఏఐ టెక్నాలజీ , అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో బట్టలకు పూర్తి సేఫ్టీ అందిస్తుంది. అంతే కాకుండా దీనిలోని లేటెస్ట్ ఫీచర్లు బడ్జెట్‌లోనే మనకు అందుతున్నాయి. ఈ వాషింగ్ మెషీన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. ఏఐ డైరెక్ట్ డ్రైవ్ ,6 మోషన్ టెక్నాలజీ:

ఈ వాషింగ్ మెషీన్ మెయిన్ హైలైట్ దీనిలోని ఏఐ డీడీ టెక్నాలజీ. ఇది.. బట్టల బరువును మాత్రమే కాకుండా.. వాటి ఫ్యాబ్రిక్ క్వాలిటీని ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. దానికి తగినట్లుగా డ్రమ్ కదలికలను సర్దుబాటు చేసి, బట్టలు పాడవకుండా అద్భుతంగా ఉతుకుతుంది. అలాగే.. 6 మోషన్ టెక్నాలజీల సహాయంతో.. బట్టలను వివిధ రకాలుగా తిప్పుతూ, వాటిలోని మొండి మరకలను కూడా ఈజీగా తొలగిస్తుంది.

2.స్టీమ్ వాష్,ఇన్‌బిల్ట్ హీటర్ :

Advertisement

ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన ప్రస్తుత కాలంలో స్టీమ్ వాష్ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ వాషింగ్ మెషీన్‌లో ఉన్న ఇన్‌బిల్ట్ హీటర్ నీటిని వేడి చేసి, ఆవిరి ద్వారా బట్టలను ఉతుకుతుంది. దీని వల్ల బట్టలపై ఉండే 99.9% బ్యాక్టీరియా, అలర్జీ కారకాలు పూర్తిగా నశిస్తాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో.. లేదా సున్నితమైన చర్మం ఉన్నవారి బట్టలను శుభ్రం చేయడానికి ఈ ఫీచర్ చాలా బాగా పని చేస్తుంది.

3. 5-స్టార్ రేటింగ్, ఇన్వర్టర్ :

ఎలక్ట్రిసిటీ బిల్లుల గురించి ఎక్కువగా ఆలోచించే. వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. అంటే కరెంట్ వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్ ఉండటం వల్ల మెషీన్ పని చేస్తున్నప్పుడు శబ్దం వైబ్రేషన్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ మోటార్‌పై కంపెనీ ఎక్కువ కాలం వారంటీ కూడా అందిస్తుంది, తద్వారా ఎలాంటి టెన్షన్ లేకుండా దీన్ని వాడొచ్చు.

Advertisement

Also Read: రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే

4. వైఫై కనెక్టివిటీ, స్మార్ట్ థింక్ :

ఇది కేవలం సాధారణ వాషింగ్ మెషీన్ కాదు, ఒక స్మార్ట్ అప్లయన్స్. LG ThinQ యాప్ ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్‌కు దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా సరే.. మీ ఫోన్ ద్వారానే వాషింగ్ మెషీన్‌ను ఆపరేట్ చేయడం,వాషింగ్ సైకిల్స్‌ను పర్యవేక్షించడం , కొత్త వాషింగ్ ప్రోగ్రామ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటివి చేయొచ్చు. 9 కేజీల కెపాసిటీ ఉండటం వల్ల పెద్ద కుటుంబాలకు లేదా ఎక్కువ బట్టలు ఉతికేవారికి ఇది సరిగ్గా సరి పోతుంది.

మీ ఇల్లు లేదా అపార్ట్‌మెంట్ కోసం ఎక్కువ కెపాసిటీ,లేటెస్ట్ ఏఐ ఫీచర్లు, తక్కువ కరెంట్ బిల్లు వచ్చేలా ఒక బెస్ట్ వాషింగ్ మెషీన్ కావాలనుకుంటే..రూ.41,490 బడ్జెట్‌లో లభించే.. ఈ మోడల ఒక అద్భుతమైన పెట్టుబడి అని చెప్పొచ్చు. ఇది మీ బట్టలకు కొత్తదనాన్ని.. ఇవ్వడంతో పాటు మీ ఇంటికి ప్రీమియం లుక్‌ తెస్తుంది.

Related News

రూ.1,999లకే అద్భుతమైన ఫీచర్లు..ఈ స్మార్ట్‌ వాచ్‌పై ఓ లుక్కేయండి

కరెంట్ సబ్ స్టేషన్ లో కంకర ఎందుకు పరుస్తారు? ఇదీ అసలు కథ!

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే.. 5 మైక్రోవేవ్ ఆప్షన్స్!

రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే

మూవీ లవర్స్ కోసం క్రేజీ గాడ్జెట్..ఈ ప్రొజెక్టర్ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ !

మొబైల్ యూజర్లకు అలర్ట్.. ఆగస్టు 24 నుంచి కొత్త సిమ్ రూల్స్.. పరిమితి దాటితే అంతే!

కారులో ఫోన్ ఛార్జ్ చేస్తున్నారా? అసలు నిజం తెలిస్తే ఎప్పటికీ అలా చేయరు!

Big Stories

Advertisement
×