BigTV English

PM Modi: సిస్టమ్ లాగౌట్ చేస్తున్నారా? నా సిస్టమ్ నేనే లాగౌట్ చేస్తా.. ప్రధాని మోదీ

PM Modi: సిస్టమ్ లాగౌట్ చేస్తున్నారా? నా సిస్టమ్ నేనే లాగౌట్ చేస్తా.. ప్రధాని మోదీ

PM Modi Shares Cybersecurity Tip To Bureaucrats: డిజిటల్ ప్రపంచంలో సైబర్ భద్రత ఎంతో ముఖ్మని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆఫీస్ లో పని పూర్తయిన వెంటనే ఇంటి వెళ్లే సమయంలో ప్రతి ఉద్యోగి విధిగా తన సిస్టమ్ లాగౌట్ చేసుకోవాలని మోదీ సూచించారు. నిత్యం పని పూర్తయిన వెంటనే మీ సిస్టమ్స్ లాగౌట్ చేస్తారా? నేను చేస్తానని, సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమని మోదీ హెచ్చరించారు.


డిజిటల్ ప్రపంచంలో జీవిస్తున్న మనం నిత్యం హ్యాకింగ్, సైబర్ మోసాలు, వైరస్ దాడుల గురించి వింటున్న తరుణంలో ప్రధాని మోదీ అధికారులకు ఓ సూచన చేశారు. రోజూ పని ముగించుకొని ఉద్యోగులు ఇంటికి వెళ్లిన తర్వాత సిస్టమ్స్ లాగౌట్ అయ్యాయా లేదా అని చూసుకోవాలని సూచించారు. అదే విధంగా వీటిని చూసుకునేందుకు ప్రతీ కార్యాలయంలో ఒక వ్యక్తికి అప్పగించాలంటూ చెప్పారు.

సిస్టమ్ నిరంతరం ఓపెన్ చేసి ఉంచడంతో సైబర్ మోసాలు పెరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులకు చెప్పారు. ఇటీవల సీనియర్ బ్యూరోక్రాట్లతో జరిగిన సమావేశంలో ప్రధాని హెచ్చరించారు.


అంతకుముందు ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో సైబర్ భద్రతపై తీవ్రంగా చర్చించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రభుత్వ వ్యవస్థలు సైతం సైబర్ దాడులకు గురైన నేపథ్యంలో సైబర్ భద్రత కేంద్ర ప్రభుత్వానికి కీలక అంశంగా మారింది. అయితే ఈ చర్చలో ప్రధాని మోదీ, బిల్ గేట్స్ డిజిటల్ టెక్నాలజీపై సుదీర్ఘంగా చర్చించారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎక్కువగా మక్కువ చూపుతానని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానం కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఉత్తేజంతో ఉంటానని వెల్లడించారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీ ఉపయోగించినట్లు తెలిపారు.

ఏఐ శక్తివంతమైనదే అయినప్పటికీ దానిని మ్యూజిక్ టూల్ గా ఉపయోగిస్తే చాలా పరిణామాలు చోటుచేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సరైన శిక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఇలాంటి హై టెక్నాలజీ తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుందన్నారు.

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×