SVAMITVA Scheme: గ్రామీణ ప్రజలకు సాధికారికత కల్పించేందుకు మోదీ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఐదేళ్ల కిందట ప్రవేశపెట్టిన స్వామిత్వ స్కీమ్ ద్వారా శనివారం 50 వేల గ్రామాల్లోని లబ్దిదారులకు ప్రయోజనం చేకూరింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా వర్చువల్ కార్యక్రమంలో లబ్దిదారులకు ఆస్తి కార్డులను అందజేశారు.
దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 230 జిల్లాల్లో లబ్దిదారులకు ఆస్తి కార్డులను అందజేశారు. సర్వే ఆఫ్ విలేజెస్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్‌డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియా-స్వామిత్వ కింద ప్రజలకు ఆస్తి కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ చారిత్రాత్మక రోజుగా వర్ణించారు. ఈ స్కీమ్ ద్వారా గడిచిన ఐదేళ్లలో దాదాపు 2.25 కోట్ల మంది లబ్ది పొందారు. ఒడిషా, ఛత్తీస్ గడ్, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సీఎంలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
2020లో మొదలైన స్వామిత్వ స్కీమ్, గడిచిన ఐదేళ్లలో 1.5 కోట్ల మందికి ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. శనివారం మరో 65 లక్షల మంది వంతైంది. ఆ తర్వాత రాజస్థాన్ లోని శ్రీగంగా నగర్‌కు చెందిన లబ్దిదారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రాపర్టీ మానిటైజేషన్‌ను సులభతరం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను సేకరణకు మద్దతు ఇస్తోంది.
ALSO READ: అక్కడి ప్రజలపై బీజేపీ వరాల జల్లు.. ఇన్ని హామిలు ఇవ్వడం ఇదే తొలిసారి
ఇప్పటి వరకు 3.17 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వేలు పూర్తి అయ్యాయి. 92 శాతం ప్రాంతాలను కవర్ చేశారు. లక్షా 50 వేలకు పైగా గ్రామాలకు సంబంధించి దాదాపు రెండు కోట్ల 25 లక్షల ప్రాపర్టీ కార్డులను సిద్ధం చేస్తున్నారు. అనేక కేంద్ర పాలిత ప్రాంతాలలో డ్రోన్ సర్వేలు పూర్తయ్యాయి.