BigTV English

PM Modi : ఇండియన్ ఇండస్ట్రీకి ప్రధాని మోదీ క్లాస్ – ఇలా ఉంటేనే మనకు లాభం

PM Modi : ఇండియన్ ఇండస్ట్రీకి ప్రధాని మోదీ క్లాస్ – ఇలా ఉంటేనే మనకు లాభం

PM Modi : అంతర్జాతీయంగా అందివస్తున్న అవకాశాల్ని వినియోగించుకోవాలి, ఇంటర్నేషన్ సప్లై చైన్ లో దేశీయ పారిశ్రామిక తయారీదారులు చురుగ్గా పాల్గొనాలని, కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర బడ్జెట్ పై విధాన నిర్ణేతలు, నిపుణులు, పరిశ్రమ నాయకులతో జరిగిన వెబ్‌నార్ లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల గురించి, అవి భారతీయ తయారీదారులకు మార్కెట్లోని అవకాశాల గురించి ప్రధానమంత్రి చర్చించారు. ఇతర దేశాల్లో మంచి గుర్తింపు, విశ్వాసాన్ని సంపాదించాలి అంటే.. అధిక-నాణ్యత ఉత్పత్తులకు విశ్వసనీయ కేంద్రంగా ఉండాల్సిందేనని తెలిపారు.


పాశ్చాత్య దేశాల్లో అనేకం ప్రత్యక్ష, పరోక్ష యుద్ధంలో చిక్కుకుని ఉన్నాయి. రష్యా- ఉక్రెయిన్ ఓ వైపు యుద్ధంలో మునిగిపోయి ఉంటే, ఇజ్రాయిల్ – గాజా, హమాస్ వంటి ఉగ్రసంస్థలతో పోరాటం సాగిస్తోంది. దీంతో.. ఈ దేశాలకు చెందిన మిత్ర దేశాలు సైతం సాయంగా నిలుస్తున్నాయి. దీంతో.. ప్రపంచ రాజకీయాలు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. పైగా.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్.. పన్నుల పేరుతో విదేశాలను బెదిరిస్తున్న కారణంగా.. వాణిజ్యం రంగంలోనూ కాస్త భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో దేశీయ పారిశ్రామిక, తయారీ రంగాలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని ప్రత్యేక సూచనలు అందించారు. విశ్వసనీయ సప్లై చెయిన్ ను ఏర్పాటు చేసుకుని, అధిక-నాణ్యత ఉత్పత్తులను సరఫరా చేయాలని.. అన్ని దేశాల నుంచి మంచి గుర్తింపు సాధించాలని అన్నారు. ప్రపంచ అవసరాల్ని తీర్చేందుకు భారత్ కు మంచి అవకాశాలున్నాయన్న ప్రధాని మోదీ.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

క్రియాశీల పరిశ్రమ భాగస్వామ్యం ప్రాముఖ్యతను తెలుపుతూ.. ప్రపంచ పరిణామాల్ని పరిశీలిస్తూ కూర్చుంటే లాభం లేదని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. మన పరిశ్రమ కేవలం ప్రేక్షకులుగా ఉండాలని తాను కోరుకోవడం లేదన్నారు. పరిశ్రమ దేశాభివృద్ధిలో తన పాత్ర పోషించాలని, అవకాశాలను ముందుగానే వెతకాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. గతంతో పోల్చితే పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించే స్నేహపూర్వక విధానాలు ఇప్పుడు దేశంలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం పరిశ్రమకు దృఢంగా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.


Also Read : Mayawati Re-Elected: రాజకీయాల నుంచి వైదొలుగుతలేనంటూ పేర్కొన్న మాయావతి.. మరునాడే భారీ ప్రకటన చేసిన పార్టీ వర్గాలు

దేశీయ ఉత్పత్తి లక్ష్యాల్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అడ్డుగా ఉన్న సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పరిశ్రమలు చర్యలు తీసుకోవాలని సూచించారు. బలమైన సంకల్పం, స్పష్టమైన లక్ష్యాలతో, ప్రపంచ సరఫరా గొలుసులో ఏకీకరణ సవాళ్లను స్వీకరించాలని సూచించారు. ప్రతి పరిశ్రమ దశలవారీగా అంతర్జాతీయ అవకాశాల్ని అందుకునేందుకు ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచ తయారీ దిగ్గజాలకు భారత్.. మంచి ప్రత్యామ్నాయంగా కనిపిసితున్న తరుణంలో ప్రధానమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బలమైన దృష్టితో.. భారత్ ప్రపంచ వాణిజ్యంలో తనను తాను కీలక పాత్రధారిగా నిలబెట్టుకుంటోంది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×