BigTV English

Priyanka Gandhi comment on Modi govt: న్యాయవ్యవస్థపై ఒత్తిడి.. ఎందుకు? తీర్పుకు ముందు..

Priyanka Gandhi comment on Modi govt: న్యాయవ్యవస్థపై ఒత్తిడి.. ఎందుకు? తీర్పుకు ముందు..

Priyanka Gandhi comments on modi govt of pressuring judiciary after electoral bonds judgment


PriyankaGandhi comment on Modi govt: మోదీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఇది ముమ్మాటికీ నిజమని అన్నారు ప్రియాంకగాంధీ.

దేశంలో స్వతంత్య్ర న్యాయవ్యవస్థ ఉండటం ప్రధాని మోడీకి ఆమోదం కాదేమోనని చెప్పుకొచ్చారు. ఇటీవల 600 మంది న్యాయవాదులు సీజేఐకి లేఖ రాసిన నేపథ్యంలో ప్రియాంక ఈ విధంగా స్పందించారు.


ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉందన్నారు ప్రియాంకగాంధీ. ప్రధాని ఎందుకో భయపడుతున్నట్లు ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

మరోవైపు బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పుకు మూడు రోజుల ముందే పది వేల బాండ్ల ముద్రణకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ బాండ్ల విలువ ఒక్కొక్కటి కోటి రూపాయలుగా ఉన్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆ బాండ్ల ప్రింటింగ్ ను నిలిపివేయాలంటూ ఫిబ్రవరి 28న ఆర్థికశాఖ మరోసారి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

ALSO READ: బీజేపీపై ఆగ్రహం.. రౌడీలే ఎక్కువే, అందుకే సౌత్‌పై..

అప్పటికే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 8,350 బాండ్లను ముద్రించి ఎస్బీఐకి చేరవేసినట్టు వెల్లడైంది. ఆర్థికశాఖ-ఎస్‌బీఐ మధ్య ఈ మెయిల్ ద్వారా ఈ వివరాల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్టు సదరు వార్తా సంస్థ పేర్కొంది.

 

 

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×