BigTV English

Rahul Gandhi Counter on PM Modi: మోదీకి రాహుల్ చురక, అంబానీ, అదానీ డబ్బు టెంపోలో..!

Rahul Gandhi Counter on PM Modi: మోదీకి  రాహుల్ చురక, అంబానీ, అదానీ డబ్బు టెంపోలో..!

Rahul Gandhi Counter to PM Modi Comments on Ambani, Adani: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విడతల వారీగా జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. అయితే రెండురోజులుగా యువనేత రాహుల్ సైలెంట్‌గా ఉండటాన్ని గమనించిన ప్రధాని నరేంద్రమోదీ కామెంట్స్ చేశారు. దానికి యువనేత కౌంటర్ ఇవ్వడంతో డిఫెన్స్‌లో పడిపోయారు మోదీ. ఇంతకీ అసలేం జరిగింది?


ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రియాక్ట్ అయ్యారు. అంబానీ, అదానీలు డబ్బు టెంపోలో పంపిన విషయం మీకు తెలుసు కదా అంటూ సెటైర్లు వేశారు. ఇది మీ అనుభవమే కదా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ అవినీతి టెంపో డ్రైవర్, సహాయకులు ఎవరనే విషయం యావత్త దేశమంతటికీ తెలుసని పేర్కొన్నారు.

సాధారణంగా అదానీ, అంబానీ గురించి ప్రధాని మోదీ సీక్రెట్‌గా మాట్లాడుతారని, మొదటిసారి వారి గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు రాహుల్‌గాంధీ. దాదాపు 46 సెకన్ల నిడివి గల వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు యువనేత.


Also Read: Delhi Liquor Case: ప్రచారం చేసే హక్కు ప్రాథమికం కాదు.. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దన ఈడీ..

ఇద్దరు వ్యాపావేత్తలకు మోదీ భారీగా నిధులు ఇచ్చారని, ఆ ధనాన్ని కాంగ్రెస్ పార్టీ వివిధ పథకాల కింద ప్రజలకు పంచుతోందని సెటైర్లు వేశారు రాహుల్. అదానీ, అంబానీలు తమ పార్టీకి టెంపోలో బ్లాక్ మనీ పంపారో లేదో తెలియాలంటే సీబీఐ, ఈడీలను వారి వద్దకు పంపించి దర్యాప్తుకు ఆదేశించాలని సవాల్ విసిరారు.

బుధవారం తెలంగాణ వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ, వేములవాడలో జరిగిన బహిరంగ‌సభలో కాంగ్రెస్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన నేతలు, ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి వారి పేర్లను ప్రస్తావించడం మానేశారని ఆరోపించారు. అంతే కాదు వారి నుంచి మనీ ముట్టిందా అంటూ తనదైనశైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ కామెంట్లకు రాహుల్ కూడా అదే రేంజ్‌లో బదులిచ్చారు.

Also Read: శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా

ఈ వ్యవహారాన్ని కమలనాథులు తమకు అనుకూలంగా మలచుకునే పనిలోపడ్డారు. ఎన్నికల వేళ ప్రత్యర్థుల నుంచి ఆరోపణలు ఉంటేనే కదా ప్రత్యర్థుల నుంచి సమాధానాలు అదే రేంజ్‌లో ఉంటాయని గుర్తు చేస్తున్నారు. మరి ఉన్నట్లుండి యువనేత ఎందుకు సైలెంట్ అయ్యారన్నది కమలనాథుల నుంచి బలంగా వినిపిస్తున్నమాట.

Tags

Related News

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Ladakh: లడఖ్ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందన్న లెఫ్టినెంట్ గవర్నర్

Aadhaar download Easy: ఆధార్ కార్డు వాట్సాప్‌లో డౌన్‌లోడ్.. అదెలా సాధ్యం?

Big Stories

×