Big Stories

High Alert in Hyderabad: హైదరాబాద్ లో హై అలర్ట్.. మొన్నటి వరకు ఎండ.. ఇపుడు వర్షం!

Rain Updates in Hyderabad: భానుడి భగభగలకు తాళలేక తంటాలు పడుతున్న ప్రజలను వరణుడు కరుణించాడు. మేఘాన్ని కరిగించాడు.. చినుకుల్లా రాల్చాడు. రిజల్ట్.. సెగలతో అల్లాడిన వారంతా ఊపశమనం పొందారు. బాగుంది.. ఇక్కడి వరకు అంతా బాగుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాస ఎంత బాగుందో అంత బాగుంది నిన్న పడిన వర్షం.. బట్.. ఇదంతా కాసేపే.. గంట తర్వాత సీన్ మారింది. తడిసిన తనువు కాస్త.. ఆ తర్వాత మునిగింది. వీధులు చెరువులయ్యాయి. రోడ్లు నదులయ్యాయి. గోడలు కూలాయి.. ప్రాణాలు పోయాయి.

- Advertisement -

అసలు భాగ్యనగరం ఎందుకింత ఇబ్బంది పడింది? దీనికి కారణాలేంటి? హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. వేసవిలో 10 సెంటీమీటర్ల వర్షంపాతం కురవడం ఇదే తొలిసారి. వీటికి తోడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు.. ఇవన్నీంటితో పాటు వడగండ్లను మిక్స్ చేసి కురిసింది వాన. దీంతో భాగ్యనగరం అతలాకుతలమయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. డ్రైనేజీలు పొంగాయి.. బస్తీలు మునిగాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్‌ తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది.రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినా.. ఇబ్బందులు మాత్రం రాజధాని నగరంలోనే ఎక్కువగా ఉన్నాయనే చెప్పాలి.

- Advertisement -

ట్రాఫిక్ నరకాన్ని తలపించింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారికి నరకం కనిపించింది. 10 నిమిషాల ప్రయాణానికే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. కిలోమీటర్ల మేర వెహికల్స్‌ అన్ని ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ఇది వర్షాకాలం కూడా కాదు.. ఇంకా ఎండాకాలం పోలేదు. ఇలాంటి సమయంలో కురిసిన ఈ వర్షం.. పడిన ఇబ్బందులు అటు అధికారులు, ఇటు ప్రజలకు ఓ మేలుకొలుపు.. భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులకు ఇదో హింట్.. ముందున్నది వర్షాకాలం.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన ఇప్పటికే జనాల్లో మొదలైంది.

Also Read: రేవంత్.. వన్‌ మ్యాన్ ఆర్మీ

మరి నగరం ఇలా ఉండటానికి రీజనేంటి? మొన్న మొన్నటి వరకు హైదరాబాద్‌ను విశ్వనగరంగా ప్రచారం చేసింది బీఆర్ఎస్‌ పార్టీ.. తమ హయాంలో హైదరాబాద్‌ స్వరూపాన్నే మార్చేశామని గొప్పలు చెప్పుకుంది. బట్ రియాలిటీ ఇలా ఉంది. నాలాల ఆక్రమణలు ఉన్నాయి.. సివరేజి వ్యవస్థ మెరుగ్గా లేదు. అంటూ చెప్పుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ నేతలు.. బట్ పదేళ్ల తర్వాత ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. నగర వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు.

చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ప్రతి ఏడాది ఇదే సమస్య కనిపిస్తుంది. ఇలాగే హైదరాబాద్ మునుగుతుంది.. ప్రాణాలు పోతున్నాయి. నాలా రెయిలింగ్ వాల్స్, మ్యాన్‌ హోల్స్‌పై ఫోకస్ చేసిన అప్పటి ప్రభుత్వం.. నాలాల విస్తరణపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎట్ ది సేమట్ టైమ్.. చెరువుల ఆక్రమణ విపరీతంగా పెరిగింది. అరికట్టాల్సిన అప్పటి అధికారపార్టీ నేతలే.. కుదిరిన కాడికి కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడిఇతే వరద సాఫీగా వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేదు. నగరం కాంక్రీట్‌ జంగల్‌గా మారింది.. ఎక్కడికక్కడ నీరు ఇంకే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యేకంగా వరద నీటి కాల్వలు నిర్మించలేదు.ఉన్న వాటిని కూడా డ్రైనేజీలతో లింక్ చేశారు. పూర్వం ఉన్న లింక్‌ చెరువుల వ్యవస్థను అసలు కనుమరుగు చేసింది అప్పటి ప్రభుత్వం. ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టే.. చినుకు పడితే నగరం మునుగుతుంది.

Also Read: పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేసీఆర్

ఇందులో అధికారుల నిర్లక్ష్యం ఉందో.. ప్రజల వైపు నుంచి కూడా అంతే ఉందని చెప్పాలి. యస్.. మనం రోడ్లపై వేసే చెత్తా, చెదారం మన పాలిట శాపంగా మారుతుంది. ప్రస్తుతం రోడ్లపై నీరు నిలవడానికి సగం కారణం ఆ చెత్తే.. కావాలంటే చూడండి.. రోడ్లపై భారీగా నీరు నిలిచి ఉంటుంది. GHMC వాళ్లు వచ్చి ఆ చెత్తను తొలగిస్తారు.. పది నిమిషాల్లో రోడ్డుపై చుక్క నీరు ఉండదు.

అంతేకాదు చాలా వరకు బస్తీల్లో మెయిన్‌ నాలాలు ఉంటాయి. వచ్చే వరదతో పాటే.. ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలు వచ్చేస్థాయి. అవే ఓ చిన్న పాటి డ్యామ్స్‌లా పనిచేసి నీటిని వెళ్లకుండా చేస్తాయి. అలా నిలిచిన నీరు.. వారి ఇళ్లను ముంచేస్తుంది. అందుకే మనం కూడా కొంచెం డిసిప్లేన్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న వర్షానికి కూడా ఇళ్లు మునగడానికి కారణాల్లో ఇది కూడా ఒకటి.

రాబోయేది వర్షాకాలం.. ఇప్పుడు పడిన వర్షం.. ఓ డేంజర్ బెల్.. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే.. అసలు సమయం వచ్చే సరికి పరిస్థితి మెరుగు పడుతుంది. లేదంటే ఈసారి కూడా భాగ్యనగర వాసులకు తిప్పలు తప్పవు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News