Rahul Gandhi: ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బిజీ అయ్యారు. ఓ వైపు సభలు, మరోవైపు నేతలతో సమావేశాలతో బిజీగా ఉన్నారు. కాస్త రిలాక్స్ దొరకడంతో మానసిక ఉల్లాసం కోసం జిప్‌లైన్‌లో ట్రావెల్ చేశారాయన. ఇంతకీ ఎక్కడో తెలుసా? అక్కడికే వచ్చేద్దాం.
దేశవ్యాప్తంగా 31 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలతోపాటు వయనాడ్‌లో ఉపఎన్నికకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ పోటీ చేస్తున్నారు. ఓ వైపు మహారాష్ట్ర, మరోవైపు జార్ఖండ్ ప్రచారంలో బిజీగా ఉన్నారు రాహుగాంధీ.
ALSO READ: ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువకుల ఫైటింగ్, మధ్యలో ఆ యువతి
సోదరి ప్రియాంకగాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌కు వచ్చారు. మంగళవారం రెస్ట్ దొరకడంతో కాస్త రిలాక్స్ అయ్యారు. దక్షిణ భారత్‌లో అత్యంత పొడవైన జిప్‌లైన్‌లో ప్రయాణించారు రాహుల్‌గాంధీ. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారాయన. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ ద్వారా షేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ.
సింపుల్‌గా చెప్పాలంటే వయనాడ్‌కు వచ్చే టూరిస్టుల దీన్ని నిర్మించారు. వయనాడ్ ప్రజలకు స్థానికంగా కష్టాలు ఉన్నప్పటికీ, ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తూనే ఉంటున్నారు.
వాయనాడ్‌ను భారతదేశంలో అత్యుత్తమమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాహుల్, ప్రియాంకగాంధీలు ఓ మిషన్ చేపట్టిన విషయం తెల్సిందే. ఇందులో భాగంగానే అక్కడి కీలకమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు రాహుల్‌గాంధీ.
మరోవైపు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు ప్రియాంకగాంధీ పిలుపు నిచ్చారు. ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుని ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. ఇది రాజ్యాంగం ప్రజలకు అందించిన అతిపెద్ద బలం, దానిని సద్వినియోగం చేసుకోవాలి, అందరం కలిసి మంచి భవిష్యత్తును నిర్మించుకుందాం!
LoP Shri @RahulGandhi and Congress General Secretary Smt. @priyankagandhi ji had a candid interaction with some locals in Wayanad whose stories of resilience greatly inspired them.
From the largest giant swing in South India to a thrilling zipline, the people of Wayanad have… pic.twitter.com/4K3bdmRxWy
— Congress (@INCIndia) November 12, 2024