EPAPER

Rahul Gandhi: ప్రధాని మోదీకి ఇక గడ్డుకాలమే: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ప్రధాని మోదీకి ఇక గడ్డుకాలమే: రాహుల్ గాంధీ

భయంలో మోదీ
– ఇండియా కూటమితో మారిన ఈక్వేషన్స్
– ప్రధాని మోదీకి ఇక గడ్డుకాలమే
– జమ్మూ కశ్మీర్‌కు త్వరలోనే మంచిరోజులు
– ప్రజల హక్కులను పునరుద్ధరిస్తాం
– అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ


Jammu Kashmir: జమ్మూ కశ్మీర్ కోల్పోయిన రాష్ట్ర హోదాను తిరిగి ఇప్పించి, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాట పట్టించటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. బుధవారం జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంబన్ బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయంతో కశ్మీరీయులు కోల్పోయిన హక్కులను తిరిగి వారికి ఇస్తామని స్పష్టం చేశారు. రాహుల్‌ ర్యాలీ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల్లోనూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కూటమి గెలుపుతో..
ప్రధాని మోదీ తనను తాను ఓ దైవాంశ సంభూతుడిగా భావించుకుంటున్నారని, మిగిలిన సమాజంతో తానూ భాగమేననే వాస్తవాన్ని ఆయన అంగీకరించలేరని రాహుల్ విమర్శించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి సాధించిన విజయంతో ప్రధానికి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. గతంలో బీసీ కులగణన అసాధ్యమని ప్రకటించిన మోదీ ఇప్పుడు దానిపై మాట మార్చారని, ఆర్ఎస్ఎస్ కూడా దీనిపై తన రూటు మార్చుకుందని గుర్తుచేశారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, చిరువ్యాపారులు, నిరుద్యోగులు ఈ సమాజంలో భాగం కానట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.


రాష్ట్రహోదా ఇచ్చి తీరతాం..
జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని అనాలోచితంగా, ఒంటెత్తు పోకడలతో మోదీ సర్కారు లాగేసుకుందని, దానిని పునరుద్ధరించి తీరతామని రాహుల్ హామీ ఇచ్చారు. 1947లో దేశంలోని జమీందారులు, రాజుల నుంచి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బదిలీ చేసిందని, 1950లో ఒక మంచి రాజ్యాంగాన్ని ప్రజలకు అందించిందని రాహుల్ గుర్తుచేశారు. కానీ, నేడు మోదీ పాలనలో జమ్ము కశ్మీర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పేరుతో ఓ రాజు పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు.

Also Read: Amit shah: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. ఏపీకి త్వరలోనే..

మూడు దశల్లో ఎన్నికలు
జమ్మూ కశ్మీర్‌లో సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు గానూ, కాంగ్రెస్ 32 స్థానాల్లో, నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో పొత్తుపై పోటీ చేయనున్నాయి. 5 స్థానాల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుంది. సీపీఎం, పాంథర్స్ పార్టీలకు చెరొక స్థానాన్ని ఎన్‌సీ వాటాలో కేటాయించారు. కాంగ్రెస్ ఇప్పటికే 9 మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఈసారి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సహా 40 మంది స్టార్ క్యాంపయినర్లు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించింది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×