Rahul Gandhi: భారత్, దాయాది దేశం పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ఆపానని 29 సార్లు ట్రంప్ చెప్పినట్టు లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెప్పినట్టు అయితే.. ఆ విషయాన్ని ప్రధాని సభలో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. పహల్గామ్ దాడిని ప్రతీ ఒక్కరూ ఖండించారని ఆయన చెప్పారు. భారత్ – పాక్ మధ్య సీజ్ ఫైర్ పై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
భారత సైన్యం పులి లాంటిది….
‘భారత సైన్యాన్ని రాహుల్ గాంధీ పులితో పోల్చారు. పులిని స్వేచ్ఛగా ఉంచాలి. త్రివిధ దళాలను సమర్థవంతంగా ఉపయోగించేందుకు రాజకీయ సంకల్పం ఉండాలి. శ్రీనగర్ లో టెర్రరిస్టులు నిర్దయగా అమాయక టూరిస్టులను చంపేశారు.. పాక్ దుశ్చర్యను సభలోని ప్రతీ ఒక్కరూ ఖండించారు.. ప్రభుత్వానికి అండగా ఉంటామని పార్టీలన్నీ చెప్పాయి. ప్రతిపక్షంగా ఐక్యంగా ఉన్నందుకు మేం గర్వపడుతున్నాం. దేశ భద్రతపై మేం కేంద్రానికి అండగా ఉంటాం’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
ఇది ఇందిరాగాంధీ డేర్..
‘1971 యుద్ధంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించింది. అప్పటి జనరల్ మాణిక్ షాకు ఇందిరా గాంధీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. యుద్ధం చేసే రాజకీయ సంకల్పం ప్రభుత్వానికి లేదు. రక్షణ మంత్రి చెప్పిన విషయాలు తేటతెల్లం చేస్తున్నాయి. మీరు దాడులు చేయొద్దని పాక్ కు చెప్పడం దేనికి సంకేతం..? పైలెట్లను ముందుకు పంపి వారి చేతులు కట్టేశారు.. ప్రభుత్వ నిర్ణయాల వల్లే మన విమానాలు కూలిపోయాయి. పాక్ సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ ను ధ్వంసం చేయొద్దని చెప్పారు. ఐఏఎఫ్ ఎలాంటి తప్పుచేయలేదు. తప్పు చేసింది రాజకీయ నాయకత్వం మాత్రమే’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ: Jagityala News: భార్య, పిల్లలను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం.. చివరకు భర్త చేసిన పనికి..?
ప్రధాని ఇమేజ్ కోసమే ఇదంతా..?
‘మౌలిక సదుపాయాలు, ఎయిర్ డిఫెన్స్ పై దాడి చేయమని పాకిస్థాన్ కు ఎందుకు చెప్పారు..? ఇదంతా ప్రధాని ఇమేజ్ ను కాపాడేందుకు చేసిన ప్రయత్నమే.. యుద్ధం ఆపానని 29 సార్లు ట్రంప్ చెప్పారు. ఆయన అబద్ధం చెప్పినట్టు అయితే.. ఆ విషయాన్ని ప్రధాని సభలో చెప్పాలి.. ఇందిరా గాంధీలో ఉన్న ధైర్యం సగం ఉన్నా ప్రధాని చెప్పాలి. ప్రధానికి ధైర్యం ఉంటే ట్రంప్ అబద్ధాల పుట్ట అని చెప్పాలి.. ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించాయి.. ప్రపంచ దేశాలన్నీ భారత్, పాక్ ను ఒక్కటిగా చూస్తున్నాయి’ రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
ALSO READ: CM Chandrababu Naidu: దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ మన ఏపీలో.. ఇక లక్షల కోట్లల్లో పెట్టుబడులు
మునీర్, ట్రంప్ కలిసి భోజనం..
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఒక్క దేశం కూడా పాక్ ను ఖండించలేదు. ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించాయి. పహాల్గామ్ సూత్రధారి మునీర్, ట్రంప్ కలిసి భోజనం కూడా చేశారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.