Jagityala News: జగిత్యాల జిల్లాలో విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. పెంబటల గ్రామానికి చెందిన బింగి రాజశేఖర్, లాస్య ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, రాజశేఖర్ ఒక ట్రాన్స్‌జెండర్‌తో సంబంధం పెట్టుకుని, భార్య లాస్యను, పిల్లలను వదిలేసి వారితో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన లాస్య తీవ్ర మనోవేదనకు గురై, ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో లాస్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్ అనే వ్యక్తికి లాస్యతో పదేళ్ల క్రిత పెళ్లి అయ్యింది. వారికి ఇద్దరు కుమారులు కూడా పుట్టారు. అయితే గత కొన్ని రోజుల నుంచి రాజశేఖర్ ఓ ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన లాస్య ఇంట్లో గొడవ పెట్టడం ప్రారంభించింది. పెద్దల సమక్షంలో గొడవ కూడా పెట్టించింది. ఇలా భార్యా భర్తల మధ్య నిత్యం గొడవలు జరగడం ప్రారంభమైంది. చాలా సార్లు భర్తను మందిలించినా అతని తీరు మారలేదు. దీంతో లాస్య తీవ్ర మనోవేదనకు గురైంది.
ALSO READ: Girlfriend – Boyfriend: ప్రియుడిని కిడ్నాప్ చేసిన ప్రియురాలు.. 8 రోజులు బంధించి ఏం చేసిందంటే?
చివరకు లాస్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. అయితే.. ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు, రాజశేఖర్ ఆమెను కనీసం ఆమెను చూడడానికి కూడా రాలేదు. దీంతో లాస్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: TCS CEO Salary: TCSలో ఉద్యోగాల కోత.. CEOకు మాత్రం అన్ని కోట్ల జీతమా? తగ్గించుకోవచ్చుగా?
ఈ ఘటన సమాజంలో వివాదాస్పదంగా మారింది. ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛ, సంబంధాల గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు కుటుంబ విలువలు, బాధ్యతల గురించి చర్చలకు దారి తీసింది. లాస్య ఆత్మహత్యాయత్నం ఈ ఘటన తీవ్రతను మరింత స్పష్టం చేసింది. స్థానికులు ఈ ఘటనను ఒక విచిత్రమైన సంఘటనగా భావిస్తున్నారు. ఇది కుటుంబ సంబంధాలలో సమతుల్యత, సామాజిక అవగాహన అవసరాన్ని గుర్తు చేస్తుంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.