Big Stories

CM Yogi Comments on Ration Free: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు.. మన దేశంలో రేషన్ ఫ్రీ: యూపీ సీఎం

UP CM Yogi Comments on Free Ration in India: పాకిస్థాన్‌లో తినడానికి ఏమీ లేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు.. కానీ, మన దేశంలో ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం.. ఇది కాదా దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్? అని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. శుక్రవారం యూపీలోని ఆమ్రోహాలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పారు. ‘మన పక్క దేశమైన పాకిస్థాన్ లో 23 నుంచి 24 కోట్ల వరకు జనాభా ఉంటుంది.. అయినా కూడా అక్కడ ఆహార కొరత వల్ల అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు.. అయితే, మన దేశంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ ఇస్తుంది.. ఇంతమంది జనాభా ఉన్న ఇక్కడ ఎలాంటి ఆహార కొరత లేదు.. కారణం బీజేపీ ప్రభుత్వ పనితీరు. దేశం అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఇది కాదా బెస్ట్ ఎగ్జాంపుల్ ?’ అని ఆయన అన్నారు. మరోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని, అభివృద్ధిలో దేశాన్ని ఇంకా ముందంజలో నిలబెట్టుతుందని ఆయన అన్నారు.తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

- Advertisement -

Also Read: వద్దని చెప్పినా వాళ్లు మళ్లీ వస్తున్నారు: పీఎం మోదీ

ఆమ్రోహా నుంచి బరిలోకి దిగిన అభ్యర్థి తన్వార్‌కు ఓటు వేసి గెలిపించాలని అక్కడి ప్రజలను వేడుకున్నారు. అయితే, తన్వార్ 2019 ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి డానీష్ అలీ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అలీ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News