Putin call to PM Modi: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతదేశానికి చాలా దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా కూడా మన దేశానికి సపోర్టుగా నిలుస్తోంది. రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరు ఇరువురు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం అంతం చేయడానికి తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పుతిన్ పేర్కొన్నారు.
పహల్గామ్ లో జరిగి ఉగ్ర దాడిలో అమాయక టూరిస్టులు మృతి చెందడం పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం అంతమొందించడానికి భారత్ చేస్తున్న పోరాటానికి రష్యా పూర్తి మద్దతుగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఈ పిరికిపంద దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను కూడా ఎక్కడున్నా పట్టుకుని కటినంగా శిక్షించాలని పుతిన్ స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర స్థాయిలో ఖండించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధార్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 27 మంది అమాయక టూరిస్టుల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన ఉగ్రవాదంపై పోరులో భారత్ కు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాని వెల్లడించారు.
కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిపై చర్చలతో పాటు భారత్ – రష్యా ప్రత్యేక సంబంధాల గురించి కూడా మాట్లాడుకున్నట్టు ఆయన తెలిపారు. అలాగే అద్భుతమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత కట్టుదిట్టంగా, బలోపేతంగా చేసేందుకు ఇరువురు నేతలు తన నిబద్ధతను పునరుద్ఘాటించారని జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగానే రష్యా విక్టరీ డే 80వ వార్షికోత్సవం సందర్భంలగా వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోదీ విషెస్ తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం చివరలో భారతదేశంలో జరిగే వార్షిక సదస్సుకు తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానించారు.
ఇక గత నెల ఏప్రిల్ 22న కశ్మీర్ లోని పహల్గామ్ లో దారుణ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 27 మంది మృతిచెందారు. ఈ క్రమంలోనే రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ భారత్ కు పూర్తి మద్దతు తెలుపుతూ.. ప్రధాని మోదీ కాల్ చేశారు. ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్, దాయాది దేశం పాకిస్థాన్ ల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తూనే ఉన్నాయి. ఈ దాడి జరిగిన తర్వాత పాక్ పై మన దేశం రాజకీయ, దౌత్యపరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు పూర్తి మద్ధతు వస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Indian Military Academy: గుడ్‌న్యూస్.. ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు..!