BigTV English

Bharath Railway Straike I పాత స్కీం పునరుద్దరణకై రైల్వే ఉద్యోగుల సమ్మె సైరన్

Bharath Railway Straike I పాత స్కీం పునరుద్దరణకై రైల్వే ఉద్యోగుల సమ్మె సైరన్
Siren strike of railway job, workers for revision of old scheme
 

Bharath Railway Straike: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే సర్వీస్‌లు ఎంతగానో ఉపయోగపడుతాయి. అలాంటి ప్రయాణికులను తమతమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తూ..ప్రయాణికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా గాని.. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా..రైల్వే ఉద్యోగులు, కార్మికులు తమ సేవలను అందిస్తున్నారు. అయితే వారి సమస్యలను పరిక్షించాలని కోరుకుంటూ గతకొంతకాలంగా పాత స్కీంని పునరుద్దరించాలనే అప్పీల్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. అయినా సరే కేంద్రం తమ సమస్యలను పరిష్కరించలేదని రైల్వే ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించేందుకు రెడీ అవుతున్నారు.


రైల్వే ఉద్యోగులకు పాత పెన్షన్‌ స్కీంని పునరుద్ధరించకపోతే మే నుండి అన్ని రైళ్ల సర్వీసులనూ నిలిపివేస్తామని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్య వేదిక జాయింట్‌ ఫోరం ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జెఎఫ్‌ఆర్‌ఒపిఎస్‌) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. జెఎఫ్‌ఆర్‌ఒపిఎస్‌ కోర్ కమిటీ సమావేశంలో మే 1, 2024 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నుండి ఓపీఎస్‌ కోసం నిరవధిక సమ్మెను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. అంతేకాకుండా ఈ సమ్మెలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాలంటూ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Read More:జార్ఖండ్‌లో దారుణం.. స్పెయిన్‌ యువతిపై గ్యాంగ్‌రేప్‌..


నూతన పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పిఎస్‌) స్థానంలో నిర్వచించబడిన హామీతో కూడిన పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరించాలని ఎంతోకాలంగా రైల్వే ఉద్యోగులందరూ కోరుతున్నా ప్రభుత్వం మాత్రం ఏం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ప్రత్యక్ష చర్యకు దిగడం మినహా..మరో మార్గం లేదని జెఎఫ్‌ఆర్‌ఒపిఎస్‌ కన్వీనర్‌, ఆలిండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. జెఆఫ్‌ఆర్‌ఒపిఎస్‌ ఆధ్వర్యంలో వివిధ ఫెడరేషన్ల ప్రతినిధులు సంయుక్తంగా ఈనెల 19న అధికారికంగా రైల్వే మంత్రిత్వ శాఖకు సమ్మె నోటీసు అందజేయనున్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడే నాటి నుంచి దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.

ఈ సమ్మెలో రైల్వే ఉద్యోగులు, కార్మికులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు, సంఘాలు కూడా పాల్గొంటాయని ఆలిండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి మిశ్రా తెలిపారు. సమ్మె నోటీసును ఇవ్వడానికి అన్ని రాజ్యాంగ సంస్థలు తగు చర్యలు తీసుకోవాలని,, అన్నిరకాల సన్నాహాలు చేయాలని జెఆఫ్‌ఆర్‌ఒపిఎస్‌ కోరింది. ఒపిఎస్‌ కార్మికుల ప్రయోజనాల కోసం ఉద్దేశించిందని, నూతన పెన్షన్‌ పథకం ఉద్యోగుల, కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోదని మిశ్రా విమర్శించారు.

Read More: క్షమాపణలు చెప్పండి.. కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి గడ్కరీ నోటీసు..

ఈ సమ్మెలో ప్రభుత్వ సంఘాలు భాగం కానున్నాయని పేర్కొన్నారు. కార్మికుల ప్రయోజనాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివగోపాల్ మిశ్రా వివరించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన రైల్వేలో సమ్మె అనడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా రైల్వే ఉద్యోగుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని రైల్వే ప్రయాణికులు, ప్రజలు కోరుకుంటున్నారు.

Tags

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×