Viral Video: సమాజంలో రోజురోజుకు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం లేదనే అనిపిస్తుంది. ఒకప్పుడు ఉన్న ప్రేమానురాగాలు ఇప్పటి కాలంలో అసలు కనిపించడమే లేదు. తల్లిదండ్రులు అంటే అభిమానం, ప్రేమ, గౌరవం, జాలి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వారిని కని, పెంచి, పోషించిన వారు ఎప్పుడు చివరి దశలోకి వెళ్తారా, ఆస్తులు, డబ్బులు ఎలా దోచేసుకుందామా అనే చూస్తున్నారు. ఇలా యువత దశ నుండే తల్లిదండ్రులతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అయితే తాజాగా ఓ తల్లి దీన స్థితి చూస్తుంటే అందరినీ కన్నీటి పర్యంతానికి గురిచేస్తుంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ 55 ఏళ్ల మహిళ డబ్బు సంపాదించడానికి ఆటో నడుపుతుంది. ఇంత వయసులో రాత్రింబవళ్లు కష్టపడుతూ ఆటో నడుపుతూ డబ్బులు సంపాదిస్తుంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. విశ్రాంతి తీసుకునే వయసులో ఓ మహిళ ఇంతలా కష్టపడుతూ ఆటో నడుపుతుండడం చూస్తే అందరినీ భావోద్వేనికి గురిచేస్తుంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నపుడు వారి కోసం కష్టపడి తిండి, బట్టలు, చదువు ప్రతీ దానిలో ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటే చివరికి తల్లి అనే గౌరవం కూడా లేకుండా ఆ మహిళ పట్ల తన కుమారులు ఇలా ప్రవర్తించడం అన్యాయం అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఆటో కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి 1 గంటల వరకు నడుతూ డబ్బులు సంపాదిస్తుంది. వచ్చిన సంపాదనతో తన జీవితాన్ని గడుపుతుంది.
ఓ కంటెంట్ క్రియేటర్ ఆటో నడుపుతున్న వృద్ధ మహిళను చూసి షాక్ కు గురయ్యాడు. ఈ తరుణంలో తన దీన పరిస్థితిని వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ మహిళ తన పరిస్థితి గురించి వివరంగా చెప్పింది. తన పిల్లలు తనని గౌరవించడం లేదని, కొడుకు అసలు ఏ పని చేయడని అంతేకాదు తల్లినే డబ్బులు అడుగుతూ తిరుగుతాడని, ఇవ్వకపోతే గొడవ చేస్తాడని తెలిపింది. దీంతో ఏమి చేయలేని స్థితిలో తాను బతుకు దెరువు కోసం ఇలా ఆటో నడుపుతూ డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపింది.
కొడుకు రెండేళ్ల వయసులో ఉన్న సమయంలో తన భర్త చనిపోయాడని చెప్పింది. దీంతో తానే కష్టపడి పెంచి పెద్ద చేశనాని, కానీ చివరకు తనపైనే ఆధారపడి బతుకున్నాడని వాపోయింది. తల్లి అనే గౌరవం లేకుండా ప్రవర్తిస్తాడని, డబ్బులు ఇవ్వని రోజున ఇంట్లో యుద్ధమే జరుగుతుందని కన్నీరు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
View this post on Instagram