E-Paper
Advertisement

మనిషి పెరిగితే సరిపోదు.. కాస్త బుర్ర కూడా ఉండాలి.. అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డ బొత్స!

మనిషి పెరిగితే సరిపోదు.. కాస్త బుర్ర కూడా ఉండాలి.. అచ్చెన్నాయుడుపై విరుచుకుపడ్డ బొత్స!
Advertisement

Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో వైఎస్సార్సీపీ, అధికార టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై బొత్స మండిపాటు

Advertisement

మంత్రి అచ్చెన్నాయుడు వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని బొత్స హితవు పలికారు. మనిషి ఎత్తు పెరిగితే సరిపోదని, దానికి తగ్గట్టు ఆలోచన , సంస్కారం పెరగాలని వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై మాట్లాడకుండా దద్దమ్మల పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. దద్దమ్మ అనేది అన్ పార్లమెంటరీ పదం అయితే తాను క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం తన బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ, గ్రూప్-1 నియామకాలపై సీబీఐ దర్యాప్తు

Advertisement

తమ హయాంలో జరిగిన గ్రూప్-1, డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలపై బొత్స ఘాటుగా స్పందించారు. కేవలం నిందలు వేయడం కాకుండా, ఈ రెండు పరీక్షలపై సమగ్రమైన సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని సవాలు చేశారు. నిజంగా అక్రమాలు జరిగి ఉంటే నిజా నిజాలు బయటకు వస్తాయన్నారు. ప్రతిభ కలిగిన నిరుద్యోగులను అనవసరంగా గందరగోళానికి గురిచేయకూడదని సూచించారు.

Also Read: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే!

తమ్ముడు ఇచ్చాడు.. అన్న తీసుకున్నాడు

రాష్ట్రంలో ప్రస్తుత పోలీసు వ్యవస్థపై బొత్స తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక పోలీసుల తీరుపై నమ్మకం లేదన్నారు. కొన్ని చోట్ల స్వయంగా పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే జనసేన నేత నాగబాబుకు కేబినెట్ హోదా పదవి కల్పించడంపై స్పందిస్తూ.. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వరని గ్రహించే పవన్ కళ్యాణ్ తన శాఖ నుంచే సోదరుడికి ఈ పదవిని కట్టబెట్టారని ఎద్దేవా చేశారు.

Tags

Related News

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×