Big Stories

Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధానిని కలిసిన సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ

Sonia Gandhi meet Sheikh Hasina(Telugu flash news): కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను సోమవారం కలిసారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శనివారం ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా ఆదివారం జరిగిన మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

గాంధీ కుటుంబానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. షేక్ హసీనా తండ్రి.. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుల్ రెహమాన్. అయితే అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో ఆయన సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే 1971 లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరా గాంధీ ముఖ్య ప్రాత పోషించారు. పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించారు.

- Advertisement -

Also Read: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయో తెలుసా..?

ఇందిరా గాంధీ ఆ దేశ స్వాతంత్ర్యానికి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇందిరా గాంధీ కుటుంబం, షేక్ హాసీనా కుటుంబంతో పాటు భారత్,బంగ్లాదేశ్ మధ్య పరస్పర గౌరవం పెంపొందింది.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News