BigTV English

Maggi – Pahalgam Attack: పెహల్గాం ఉగ్రదాడి.. ప్రాణాలు కాపాడిన మ్యాగీ

Maggi – Pahalgam Attack: పెహల్గాం ఉగ్రదాడి.. ప్రాణాలు కాపాడిన మ్యాగీ

ప్రత్యక్ష సాక్షులు చెప్పిన షాకింగ్ నిజాలు

ఫ్యామిలీతో టూర్ ప్లాన్ చేసుకున్న వారు.. మధ్యలోనే తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందని పర్యాటకులు అంటున్నారు. పెహల్గాంలో కాల్పులు జరిగే సమయంలో.. అతి సమీపంలోని పార్కింగ్లో  తాము ఉన్నామని, ఆ కాల్పుల శబ్దానికి భయాందోళనకు గురయ్యామని మహారాష్ట్ర నుంచి వచ్చిన పర్యాటకులు అంటున్నారు. మరో ఐదు నిమిషాల్లోనే తాము అక్కడికి వెళ్లాల్సిందని.. మ్యాగీ పాయింట్ వద్ద తినేందుకు ఆగిన నేపథ్యంలోనే.. ప్రాణాలతో తాము బయటపడ్డామని చెబుతున్నారు. పెహల్గాం నుంచి బయటికి వచ్చే క్రమంలో వాహన డ్రైవర్ రెండు సార్లు భయంతో ఆక్సిడెంట్ కూడా చేశారని వారు చెప్పారు.


బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్న పర్యాటకులు

కాగా.. ఇప్పటికే కశ్మీర్ కు బుక్ చేసుకున్న చాలా మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. ట్రావెల్ టికెట్లు మాత్రమే కాదు.. స్థానికంగా హోటళ్లలో వసతి కోసం బుక్ చేసుకున్నవి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే కాశ్మీర్ టూర్ ను 25 శాతం మంది పర్యాటకులు రద్దు చేసుకున్నారు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుకు క్యూకట్టారు.

LOC వెంట పాక్ రేంజర్ల కవ్వింపు చర్యలు

మరోవైపు పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్‌ నెలకొంది. LOC వెంట పాక్ రేంజర్ల కవ్వింపు చర్యలకు దిగారు. భారత్‌ పోస్టులు లక్ష్యంగా మోర్టార్‌ షెలర్స్‌తో విరుచుకుపడ్డారు. వెంటనే అలర్టయిన బీఎస్‌ఎఫ్‌.. దీటుగా బదులిచ్చింది. పాక్ రేంజర్లే టార్గెట్‌ బుల్లెట్ల వర్షం కురిపించింది. దాంతో తోకముడిచారు పాక్ జవాన్లు. ఇక ఇవాళ ఇండియన్ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ వెళ్లనున్నారు. సెక్యూరిటీపై రివ్యూ చేయనున్నారాయన.

భద్రత కోసం అన్ని రకాల చర్యలు

ఉగ్రదాడిపై కేంద్రం నిన్న అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించింది. అన్ని పార్టీల నేతలూ ఉగ్రదాడిని ఖండించాయి. ప్రభుత్వం తీసుకునే ఏ విషయానికైనా తమ మద్దతు ఉంటుందని ప్రకటించాయి. భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడతామని ప్రభుత్వం తెలిపింది.

కేంద్రం ఆంక్షలతో పాక్ కవ్వింపు చర్యలు

కేంద్రం ఆంక్షలతో పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందం నిలివేయడమే భారత్‌ యుద్ధాన్ని ప్రకటించడమేనని కామెంట్ చేసింది. ఆ దేశ సైనికులకు లీవ్స్ రద్దు చేసింది. దేనికైనా రెడీగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించింది. పాక్ గగనతలంపై భారత్ విమానాలకు అనుమతి రద్దు చేసింది. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని ప్రకటించింది. రెండు దేశాల ఆంక్షలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కశ్మీర్‌లో కేంద్రం భద్రతను పెంచింది. భారత్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం దాడి జరిగిన తర్వాత కేంద్రానికి అందింది. దీంతో సైన్యం అనుమానికి ప్రాంతాల్లో జల్లెడపడుతుంది.

Also Read: భారత్ మొదటి దెబ్బ.. కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్

పహల్గామ్‌ ఉగ్రదాడికి జవాన్ల ప్రతీకారం

పహల్గామ్‌ ఉగ్రదాడికి జవాన్ల ప్రతీకారం తీర్చుకున్నారు. ఉగ్రవాది ఆసిఫ్‌ షేక్ ఇంటిని పేల్చేశారు జవాన్లు. IED బాంబు అమర్చి ధ్వంసం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆసిఫ్‌ షేక్‌ది కీలక పాత్ర. పాక్‌ టెర్రరిస్టులతో చేతులు కలిపి నరమేథం సృష్టించాడు. దాంతో అతడికి బిగ్‌షాక్ ఇచ్చారు జవాన్లు. లోకల్‌గా మరికొందరు టెర్రరిస్టుల ఇళ్లను సైతం టార్గెట్ చేశారు. మరో టెర్రరిస్ట్‌ ఆదిల్ ఇళ్లును సైతం పేల్చేశారు. ఆదిల్‌ 2018లో పాకిస్థాన్‌ వెళ్లి ఉగ్రవాద శిక్ష పొందినట్లు గుర్తించారు. గతేడాది కశ్మీర్‌కు వచ్చిన ఆదిల్‌…లోకల్ యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు తేల్చారు.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×