Harish Rao: ప్రభుత్వం 121 రకాల మద్యం బ్రాండ్స్ కు నోటిఫికేషన్ ఇవ్వడం పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ‘జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్’ అని దుయ్యబట్టారు. ఈ మేరకు మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని హరీశ్ రావు అన్నారు.
కానీ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆఘమేఘాల మీద విడుదల చేస్తోందన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని ప్రభుత్వానికి.. మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకు? అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ ఉందా అని నిలదీశారు. యువత డిగ్రీలు, పిజీలు పూర్తి చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మద్యం షాపులు పెంచి డబ్బు వసూలు చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: హెచ్-1బీ కొత్త రూల్స్ రెడీ.. ఫీజు లక్ష డాలర్లు పైనే.. జాబ్ పోతే తక్షణం దేశం వీడాల్సిందే!
టైం కు యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని ఈ సర్కారు.. మద్యం షాపులకు, బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తోందన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ పేరిట విద్యార్థులు, యువతను ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. అటు రాజీవ్ యువ వికాసం.. వికసించక ముందే వాడిపోయిందన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలకు గతి లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ పగ.. యువత దగ అన్నట్లుగా తయారైందన్నారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజా పాలన? అని దుయ్యబట్టారు.
Also Read: హీరో కావాలంటే ఇన్ని అవమానాలా? ఒక్క అవకాశం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన యువకుడి కథ