Cardamom: తగినంత నిద్ర పొందడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మంది మందులు కూడా వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు యాలకులు తినడం అలవాటు చేసుకోవాలి.
యాలకులు చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ ఇవి కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అద్భుతాలు చేస్తాయి. యాలకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. రాత్రి పడుకునే ముందు యాలకులను తింటే.. శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులను మీరు అనుభవించవచ్చు. కాబట్టి యాలకుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెరుగైన నిద్ర:
యాలకులలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నాడీ వ్యవస్థను శాంత పరచడంలో సహాయపడతాయి. ఇది ఆందోళన , ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యాలకులను తినడం వల్ల నిద్ర నాణ్యత కూడా మెరుగుపడుతుంది. నిద్రపోయే ముందు యాలకుల టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు.
బరువును నియంత్రణ:
యాలకులకు దాని థర్మోజెనిక్ లక్షణాల కారణంగా బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి. ఇవి జీవ క్రియను పెంచడానికి , శరీరంలో అదనపు కొవ్వును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. నిద్రపోయే యాలకులు యాలకులు తింటే.. రాత్రంతా కొవ్వు కరిగించే ప్రక్రియ కొనసాగుతుంది.
జీర్ణక్రియ మెరుగుదల:
పడుకునే ముందు ఆకుపచ్చ ఏలకులు తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా ఇది కడుపును శుభ్ర పరుస్తుంది . చర్మ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తాజా శ్వాస కోసం:
నోటి నుండి వచ్చే చెడు మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. నోటి దుర్వాసన కారణంగా మీకు ఇతరులు దూరంగా ఉంటారు. ఇలాంటి సమయంలో చిన్న ఏలకులు మీకు మేలు చేస్తాయి. దీనిలో ఉండే సహజ సమ్మేళనాలు దుర్వాసనను తొలగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మీ శ్వాసను తాజాగా ఉంచుతాయి. అంతే కాకుండా మీ దంతాలను బలంగా ఉంచుతాయి.
చర్మానికి మెరుపు :
యాలకులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నిద్రపోయే ముందు ఒకటి లేదా రెండు ఏలకులు తింటే.. ముఖ కండరాలు సడలించి, చర్మం యొక్క మెరుపును కాపాడుతుంది. అంతే కాకుండా ఏలకులు తినడం వల్ల చర్మం అందంగా మెరుస్తుంది.
Also Read: బార్లీ వాటర్ తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
ఏలకులు ఎలా తినాలి ?
– మీరు నిద్రపోయే ముందు ఏలకుల టీ తాగితే.. మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
– యాలకులు చాలా మంచి రుచిని కలిగి ఉంటాయి. కాబట్టి దీనిని నేరుగా నమలడం ద్వారా తినవచ్చు.
– మీకు కావాలంటే, మీరు పాలలో ఏలకులు కలిపి తాగవచ్చు.
– ఏలకులను అరగంట సేపు నీటిలో నానబెట్టి, నిద్రపోయే ముందు ఆ నీటిని త్రాగాలి.
– వంటకాల రుచిని పెంచడానికి మీరు యాలకులను కూడా ఉపయోగించవచ్చు