Supreme Court: ఇస్లాం మతమార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇస్లాంలోకి మారినవారు బీసీ రిజర్వేషన్ పొందే అర్హత లేదని తేల్చేసింది. ఈ వ్యవహారం గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది. రిజర్వేషన్ల అంశంపై జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
ఇస్లాం మత మార్పిడి రిజర్వేషన్లపై గురువారం సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తులకు బీసీ రిజర్వేషన్ అర్హత లేదని తేల్చేసింది. దీనిపై గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులోని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఒక వ్యక్తి.. మరో మతంలోకి మారినంత మాత్రాన అతడి సామాజిక వెనుకబాటుతనం హిందూ వ్యవస్థ నుండి హిందూయేతర వ్యవస్థకు బదిలీ కాలేదని పేర్కొంది. మత సంస్థలు ఈ హోదాను నిర్ణయించలేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 16(4) కింద కల్పించే రిజర్వేషన్ ప్రయోజనాలను.. సామాజిక వెనుకబాటు తనాన్ని చూపి కొత్త మతంలో డిమాండ్ చేయడానికి వీల్లేదని తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వుల ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల కేటగిరీకి అర్హులు కారని గుర్తుచేసింది. కాబట్టి ఆ వ్యక్తి ఇతర మతంలోకి మారిన వెంటనే ఆ హోదాను కోల్పోతారని, దాని ఆధారంగా ఎలాంటి ప్రభుత్వ రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరని తెలిపింది.
గతంలో దీనిపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మతం మారిన ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. 2015లో హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారాడు సమీర్ అహ్మద్ అనే వ్యక్తి. సదరు వ్యక్తి ముస్లిం లెబ్బై కేటగిరీ కింద కమ్యూనిటీ సర్టిఫికెట్ కోసం తహశీల్దార్ ఆఫీసుకు అప్లై చేశాడు. దాన్ని తిరస్కరించడంతో ఈ వివాదం రాజుకుంది.
ALSO READ: నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం
దీంతో సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత మతం మారినవారికి బీసీ కోటా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం-2024లో ఓ జీవో జారీ చేసింది. దీనిపై పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ జీవోను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చేసింది, ఆ తర్వాత కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది.