E-Paper
Advertisement

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం

నాలుగేళ్లు రిలేషన్ షిప్.. ఉదయం పెళ్లి సాయంత్రం విడిపోయారు, పెళ్లికొడుకు అసలు రూపం
Advertisement

Couple: వారిద్దరు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లయిన ఆనందం ఆ జంటలో ఎంతో సేపు నిలవలేదు. ఫలితంగా ఓ సంఘటన కారణంగా తన భర్తకు దూరమై పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది నవ వధువు. మొదటి రాత్రి గడవకముందే పెళ్లయిన రోజు ఆ జంట విడిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన కన్యాకుమారి ప్రాంతంలో వెలుగుచూసింది.

కన్యాకుమారిలో షాకింగ్ ఘటన

కన్యాకుమారి జిల్లాలోని రీఠాపురం ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల వ్యక్తి.. 26 ఏళ్ల యువతిని ప్రేమించాడు. యువకుడు మాజీ సైనికుడు. యువతిది కేరళ సరిహద్దులోని పరశాలై సమీప గ్రామానికి చెందినది. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. అనుకోకుండా జరిగిన వీరిద్దరి మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. వారి ప్రేమను యువతి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది.

ఉదయం పెళ్లి, సాయంత్రం విడిపోయిన కొత్త జంట

Advertisement

ఐనప్పటికీ ప్రేమికులు తమ నిర్ణయానికి మార్చుకోలేదు, కట్టుబడి ఉండిపోయారు. చివరకు వారిని చూసి షాకైన ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. ఆ ప్రేమికులిద్దరు సోమవారం పాఠశాలలో వివాహం చేసుకున్నారు. ప్రేమికులకు పెళ్లి జరగడంతో ఇరు కుటుంబాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. ఇక్కడవరకు అంతా బాగానే జరిగింది. అసలు కథ ఇక్కడే మొదలైంది.

నాలుగేళ్ల ప్రేమకు బ్రేక్, అసలు ఏం జరిగిందంటే

రీఠాపురం ప్రాంతంలోని ఉదయం ఆ ప్రేమికుల జంట వివాహం జరిగింది. సాయంత్రం వెడ్డింగ్ హాల్‌లో వరుడి కుటుంబం విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు భారీగా హాజరయ్యారు. విందు సమయంలో పెళ్లి కొడుకు కాస్త తూలడం చూసి అమ్మాయి తండ్రి ఆశ్చర్యపోయాడు. దీంతో అల్లుడ్ని ప్రశ్నించాడు. దీంతో మామ-అల్లుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు అసభ్యకరంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జరుగుతున్న గొడవ చూసి షాకైంది పెళ్లి కూతురు.

ALSO READ: జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

Advertisement

చివరకు తండ్రి-భర్త మధ్య వివాదాన్ని ఆపింది. మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు.. మామ, భార్యపై దాడి చేశాడు. గాయపడిన కూతుర్ని చూసి కన్నతండ్రి షాకయ్యాడు. ఏం చేయాలో తెలియక, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటన తర్వాత వరుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పెళ్లి రోజు కొత్త దంపతులు దూరంగా కావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పెళ్లి కూతురు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి రోజురాత్రి అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్లాడు తండ్రి. పెళ్లయిన ఎనిమిది గంటల వ్యవధిలో భార్యాభర్తలు విడిపోతారని ఎవరూ ఊహించలేదు. మొదటి రాత్రి ముచ్చట్లు లేకుండా దూరమయ్యారు. పెళ్లి చేసుకున్న ఆ జంట, పెళ్లి రోజు ఇలాంటి పరిస్థితి రావడంతో బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Related News

జర్మనీలో షాకింగ్ కేసు కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకిన రోబో!

‘చెవి కొరికి తినేసి.. ఇప్పుడేమో ముందస్తు బెయిలా?’.. నిందితుడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

‘బ్లూ డ్రమ్’ కేసులో సంచలన తీర్పు.. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణ శిక్ష ఖరారు!

పొయ్యిలో 20కి పైగా పాములు.. ఏకంగా పిల్లలతో కాపురం పెట్టేసిందిగా? ధైర్యం ఉంటేనే చూడండి

ప్రేమకు అడ్డొచ్చిందని.. కంటికి రెప్పలా చూసిన నానమ్మనే హత్య చేసిన మనుమరాలు!

గోల్డ్ షాపు ఓపెనింగ్‌కు ముందే బిగ్ షాక్.. 12 నిమిషాల్లో రూ.8 కోట్ల బంగారం చోరీ..!

Big Stories

Advertisement
×