Supreme Court: వక్ఫ్ చట్టం-2025పై మధ్యంతర తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే వివాదాస్పదంగా భావిస్తున్న కీలక అంశాలపై స్టే విధించింది. సోమవారం సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది.
వక్ఫ్‌చట్టం-2025పై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కొన్నిసెక్షన్లకు కొంత రక్షణ అవసరమని తేల్చిచెప్పింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య మెజార్టీ ఉండాలని పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్‌లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలి. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిం వ్యక్తి ఉండటం మంచిదని అభిప్రాయపడింది.
ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ప్రొవిజన్‌ను నిలిపి వేసింది. ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసే వరకు అమల్లో ఉండదని తేల్చి చెప్పింది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలని 70కు పైగా పిటిషన్లు న్యాయస్థానంలో దాఖలయ్యాయి.
ముస్లింల ఆస్తిని తీసుకునేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందంటూ చాలా పిటిషన్లు ఆరోపించాయి. పబ్లిక్-ప్రైవేటు ఆక్రణలకు గురి కాకుండా రక్షించడానికేనని కేంద్రం వాదన. ఏప్రిల్‌లో పార్లమెంట్ ఈ బ్లిల్లు తెచ్చిన కొన్నిగంటల్లో సుప్రీంకోర్టుకి వెళ్లింది. వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి, వ్యక్తులు, డీడ్ల ఆధారంగా ఆయా ఆస్తుల డీనోటిఫై అధికారాలపై ప్రశ్నించాయి.
ALSO READ: జార్ఖండ్ లో మావోలకు ఎదురుదెబ్బ, అగ్రనేత హతం
ఈ తీర్పు చట్టాన్ని నిలిపివేయకుండా కీలకాంశాలపై పరిమితి విధిస్తూ సమగ్ర విచారణకు మార్గం సుగమం చేసింది న్యాయస్థానం. తొలుత ఆయా పిటిషన్లపై అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం మే 5న విచారణ చేపట్టింది. ఆ తర్వాత మే 15కి వాయిదా వేయడంతో ఆయన మే 13న పదవీ విరమణ చేశారు.
ఆ తర్వాత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు పూర్తి కావడంతో మే 22న తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం ఆ తీర్పును వెల్లడించింది న్యాయస్థానం. ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని, రాజ్యాంగ బద్ధతపై పూర్తి విచారణ జరగాల్సి ఉంది.