TCS Layoffs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. భారతదేశంలోని అతిపెద్ద ఐటి కంపెనీ.. తాజాగా టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తదితర కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యను సుమారు 2% తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా సుమారు 12,200 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రధానంగా మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. ఈ లే ఆఫ్‌లు 2025 జూన్ నాటికి మొత్తం 613,069 మంది ఉద్యోగుల సంఖ్యలో భాగంగా జరగనున్నాయి.
అయితే.. ఈ ఆఫ్ వెనుకప వెనుక ఆర్థిక కారణాలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటి పరిశ్రమలో తీసుకొచ్చిన భారీ మార్పులు ప్రధానమైనవని చెప్పవచ్చు. ఏఐ వల్ల క్లయింట్‌లు 20-30% ధర తగ్గింపు డిమాండ్ చేస్తున్నారని, దీని వల్ల సంస్థలు తమ లాభాలను కాపాడుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వస్తోందని టీసీఎస్ సీఈవో కృతివాసన్ తెలిపారు. టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ లే ఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు నిర్ణయం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విభాగాల్లో అమలు అవుతోందని అన్నారు.
ప్రభావిత ఉద్యోగులకు టీసీఎస్ కంపెనీ నోటీసు పీరియడ్ చెల్లింపులు, అదనపు సెవరెన్స్ బెనిఫిట్‌లు, ఆరోగ్య బీమా కవరేజీ విస్తరణ, కెరీర్ ట్రాన్సిషన్ సహాయం వంటి సేవలను అందించనుంది. క్లయింట్ సేవలపై ఎలాంటి ప్రభావం లేకుండా ఈ లే ఆఫ్‌లను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇటీవల టీసీఎస్ సవరించిన బెంచ్ పాలసీ కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. టీసీఎస్ తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి ఏఐ సాంకేతికతల్లో పెట్టుబడులు, మార్కెట్ విస్తరణ, భాగస్వామ్యాల బలోపేతం, ఉద్యోగుల నైపుణ్య శిక్షణ, ఉద్యోగ నిర్మాణంలో మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఐటీ పరిశ్రమలోని మార్పులు, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటుంది.
ALSO READ: RRB Technician Jobs: శుభవార్త.. రైల్వేలో 6238 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
అయితే.. ఉద్యోగాలు కోల్పోయే వారికి సాధ్యమైన మేరకు తాము మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని టీసీఎస్ సీఈవో కృతివాస్ చెప్పారు. ప్రస్తుతం టీసీఎస్ లో 6,13,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఇందులో 2 శాతం అంటే 12,200 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే.. ఈ లే ఆఫ్స్ ను నేరుగా ప్రకటించడం లేదు. వచ్చే ఏడాది ప్రణాళికల్లో భాగంగా ఈ లే ఆఫ్స్ ఉండనున్నాయి. అయితే అప్పటి వరకు ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ALSO READ: UIDAI: ఇంటర్‌తో ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు.. జీతం రూ.50వేలు