E-Paper
Advertisement

OTT Movie : సైతాన్ వల్ల పుట్టే పిల్లలు… భార్యాభర్తలు ఈ దెయ్యాన్ని భలే బురిడీ కొట్టించారే… క్లైమాక్స్ ట్విస్ట్ గూస్ బంప్స్

OTT Movie : సైతాన్ వల్ల పుట్టే పిల్లలు… భార్యాభర్తలు ఈ దెయ్యాన్ని భలే బురిడీ కొట్టించారే… క్లైమాక్స్ ట్విస్ట్ గూస్ బంప్స్
Advertisement

OTT Movie : ఇండోనేషియన్ హారర్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంటున్నాయి. ఈ సినిమాలు ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ జానర్ లో తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకొబోయే హారర్ సినిమా 42 దేశాల్లో విడుదలైంది. ఇది ఇండోనేషియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఒక కుటుంబాన్ని ఆవహించిన భయానక అతీంద్రియ శక్తుల చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

నెట్ ఫ్లిక్ లో

Advertisement

‘సాటన్స్ స్లేవ్స్’ (Satan’s Slaves) 2017లో విడుదలైన ఇండోనేషియన్ సూపర్‌నాచురల్ హారర్ చిత్రం. ఇది జోకో అన్వర్ దర్శకత్వంలో రూపొందింది. ఇది 1980లో వచ్చిన అదే పేరున్న సినిమాకి ప్రీక్వెల్‌గా వచ్చింది. ఇందులో తారా బస్రో, బ్రాంట్ పలారే, ఎండీ అర్ఫియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఒక కుటుంబాన్ని ఆవహించిన అతీంద్రియ శక్తుల చుట్టూ తిరుగుతుంది. నెట్ ఫ్లిక్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో 6.5/10, రాటెన్ టొమాటోస్‌లో 90% రేటింగ్‌ను సాధించింది.

స్టోరీలోకి వెళితే

Advertisement

1981లో జకార్తా దగ్గర ఒక ఊళ్లో సువోనో కుటుంబం జీవిస్తుంటుంది. ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుంది. తల్లి మావర్ని ఒకప్పుడు సింగర్, మూడేళ్లుగా ఒక వింత జబ్బుతో మంచంలోనే ఉంటుంది. ఆమె బెల్ శబ్దంతో సాయం కోసం పిలుస్తూ ఉంటుంది. కానీ ఒక రోజు ఆమె చనిపోతుంది. ఇక్కడ నుండి కథ టర్న్ తీసుకుంటుంది. కుటుంబంలో నలుగురు పిల్లలు రిని (22), టోని (16), బాండి (10), చెవిటి బాలుడు ఇయాన్ (6) తమ తండ్రి బుడిమాన్‌తో ఉంటారు. మావర్ని చనిపోయాక, ఇంట్లో వింత సంఘటనలు మొదలవుతాయి. రాత్రిళ్లు బెల్ శబ్దాలు, టీవీ ఒక్కటే ఆన్ అవ్వడం, వింత శబ్దాలు రావడం, ఇవన్నీ వీళ్ళను భయపెడుతుంటాయి. ఇక పెద్ద అమ్మాయి రిని కుటుంబాన్ని కాపాడాలని చూస్తుంది.

Read Also : కూతురితో తండ్రి పాడు పనులు… లేపేసి జైలుకెళ్తే అక్కడ అంతకన్నా దారుణం… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

ఒక రోజు రిని అమ్మమ్మ రహ్మా ద్వారా ఒక పాత లేఖను కనిపెడుతుంది. అందులో ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. మావర్ని ఒక చేతబడి గ్రూప్‌తో డీల్ చేసుకుని ఉంటుంది. ఇయాన్ 7 ఏళ్లు వచ్చినప్పుడు బలి ఇవ్వడానికి ఆ గ్రూప్‌కి అప్పగించాలి. ఇప్పుడు ఇయాన్ కు 6 ఏళ్లు, ఆ టైమ్ దగ్గరవుతోంది. రిని, టోని, బాండి ఈ రహస్యాన్ని కనుక్కోవడానికి బుడిమాన్ దగ్గరకు వెళతారు. అతను చేతబడి గ్రూప్ గురించి సమాచారం ఇస్తాడు. ఇంతలో ఇంట్లో దెయ్యం సంఘటనలు ఎక్కువవుతాయి. మావర్ని ఆత్మ కనిపిస్తూ, ఇయాన్‌ను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో స్టోరీ భయంకరమైన మలుపులు తిరుగుతుంది. మావర్ని చేసుకున్న ఒప్పందం ఏమిటి ? ఇయాన్ దుష్ట శక్తికి బలవుతాడా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే  విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×