Kashmir Terrorist Encounter| జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో భద్రతా బలగాలు, నలుగురు ఉగ్రవాదుల మధ్య మంగళవారం ఎన్ కౌంటర్ జరిగింది. గంటల తరబడి చేజింగ్ తరహాలో సాగిన ఈ ఎన్ కౌంటర్ కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కుల్గాం పట్టణంలో జరగింది. కుల్గాంలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న భద్రతా దళాలు (ఆర్మీ, పారామిలిటరీ బలగాలకు చెందని సైనికులు) వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొని ఘెరావ్ చేశారు. ఆ తరువాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు చాకచక్యంగా దాడి చేశారు.
రెండు గంటలపాటు సాగిన ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది చనిపోగానే మిగతా ముగ్గురు సమీపంలోని అడవి ప్రాంతానికి పరుగులు తీశారు. దీంతో భద్రతా బలగాలకు చెందిన సైనికులు కూడా వారిని వెంబడించారు. అడవిలో ఈ ఎన్ కౌంటర్ సాగుతోందని.. ఇద్దరు ఉగ్రవాదులు పారిపోలేని విధంగా చిక్కుకున్నారని సమాచారం. నాలుగో టెర్రరిస్ట్ తప్పించుకొని పారిపోయాడని జాతీయ మీడియా తెలిపింది.
ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గాంలో జరిగిన మారణహోమం తరువాత దేశంలో ఉగ్రవాదంపై, ఉగ్రవాదులకు ప్రోత్సహించే పాకిస్తాన్ పై ఆగ్రహావేశాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ కారణాంగానే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఒకవైపు కశ్మీర్, జమ్మూ ప్రాంతాల్లో ఉగ్రవాదులను భద్రతా బలగాలు గాలిస్తుండగా.. మరోవైపు ఉగ్రవాదంపై పోరులో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ లోని భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానికి దాడులు చేసింది. అప్పటి నుంచి పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం కొనసాగుతోంది.
Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన
ఒకవైపు కాల్పుల విరమణకు ఒప్పుకుంటూనే పాకిస్తాన్ మరోవైపు డ్రోన్లతో భారత భూభాగంలో అమాయకు పౌరులను టార్గెట్ చేస్తోంది. ఈ ఉద్రికత్త పరిస్థితుల్లో శాంతి చర్చల కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం దేశానుద్దేశించి ఒక ప్రసంగం కూడా చేశారు. పాకిస్తాన్ అణుఆయుధాల చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తోందని కానీ ఇండియా మాత్రం ఆ బెదరింపులకు తల వంచేది లేదని అన్నారు. భారత సైన్యం కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు చేసిందని.. ఆపరేషన్ సిందూర్ వల్ల ప్రపంచానికి పాకిస్తాన్ వికృత రూపం బయటపడిందని అన్నారు. పాకిస్తాన్ అండదండలున్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు, భారత పౌరుల ప్రాణాలు కాపాడేందుకు ఈ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.