Big Stories

Big Shock to Ex. KCR: డేట్ మారింది.. సీన్ రివర్సైంది..కేసీఆర్‌కి దబిడిదిబిడే..!

Big Shock to Ex KCR due to Party Migrations: తెలంగాణ భవన్ వాస్తు మార్చాం. ఇక దిశ తిరగడమే మిగిలింది. కంగారేం లేదు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మనతో టచ్‌లో ఉన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గేటు తీయడమే ఆలస్యం.. తరలివస్తారు.. పద్ధతి కాదనీ మనమే ఆపుతున్నాం. ఇది మాజీ సీఎం కేసీఆర్‌ కారు పార్టీ నేతలకు ఇచ్చిన సందేశం. కానీ ఏమైంది? క్యాలెండర్‌లో డేట్ మారగానే సీన్ రివర్సైంది.

- Advertisement -

కేసీఆర్ నిన్న అవతలి వాళ్లు టచ్‌లో ఉన్నారనగానే.. ఇప్పుడు టచ్‌లో ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. నిజానికి కేసీఆర్ ఓ పొలిటికల్‌ మైండ్‌ గేమ్‌ను స్టార్ట్ చేశారు. రాజకీయాల్లో తనని తాను అపర చాణక్యుడిగా భావిస్తారు కేసీఆర్‌. అందుకే కేసీఆర్ తనతో ఇంత మంది టచ్‌లో ఉన్నారనే తాతలకాలం నాటి పొలిటికల్ మైండ్‌గేమ్‌ను ప్రారంభించారు. ఇది నిజంగా నిజమైతే తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పటికే చాలా పరిణామాలు జరిగేవి ఎందుకంటే కేసీఆర్‌ గత చరిత్ర చెబుతోంది ఇదే. వలసలు, జంపింగులు, ప్రలోభాలతో, కొనుగోళ్లతో గతంలో కేసీఆర్‌ చేసిన పనులు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత రెండుసార్లు గెలిచిన తర్వాత ప్రతిపక్ష పార్టీలను నిలువునా చీల్చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది. అందుకే నిజంగా కాంగ్రెస్‌ నేతలు టచ్‌లో ఉంటే ఈ పాటికే వారంతా బీఆర్ఎస్‌ గూటికి చేరిపోయేవారు. కానీ ఆ పరిస్థితులు లేవు కాబట్టే కేవలం డైలాగ్‌లు మాత్రం పేలుతున్నాయి.

- Advertisement -

కేసీఆర్ చేస్తున్న ఈ మైండ్‌ గేమ్‌ను పెద్ద లీడర్లు కాదు కదా, కనీసం గల్లీ లీడర్లు కూడా నమ్మే పరిస్థితి లేదు. లేదంటే ఈ అనౌన్స్‌మెంట్ బయటికి వచ్చిన నెక్ట్స్‌ డేనే ప్రకాశ్‌ గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ఎందుకు రూట్ క్లియర్ చేసుకుంటారు..? ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో అఫిషియల్‌గా చేరారు. ఇప్పుడు మరోకరు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరు కాకుండా వందలాది మంది బీఆర్ఎస్‌ను వీడుతున్నారు. ఒక్కో మున్సిపల్‌, పంచాయతీలు కూడా బీఆర్ఎస్‌ చేజారుతున్నాయి. కార్యకర్తలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా కాంగ్రెస్‌కు క్యూ కడుతున్నారు. అందుకే కేసీఆర్ పార్టీ పరిస్థితి రోజురోజుకు హోల్ పడిన కుండగా మారింది.

Also Read: Sukesh Chandrasekhar: BRS ఆఫీస్ నుంచే అంతా జరిగింది.. జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ

మరి నేతలు పార్టీని ఎందుకు వీడుతున్నారు? ఇది మెయిన్ క్వశ్చన్.. ప్రస్తుతం దీనిపైనే కేసీఆర్ ఫోకస్ చేయాల్సి ఉంది. కానీ చేయడం లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకత్వంపై నేతలకు నమ్మకం లేదా? అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే రోజురోజుకు పరిస్థితి దిగజారుతోంది. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యి తీహార్‌కు చేరారు. హారీష్‌రావు, కేటీఆర్‌పై కబ్జాలు, అక్రమాల ఆరోపణలు వస్తున్నాయి. రేపో, మాపో కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక అత్యంత కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌ సుప్రిమో అనే పేరు ఇప్పటికే చాలాసార్లు వచ్చింది. నేడో, రేపో ఈ కేసు కూడా బీఆర్ఎస్ పెద్ద తలలకు చుట్టుకోవడం ఖాయంగా ఉంది. మరోవైపు విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జ్యూడిషియల్ ఎంక్వైరీ ప్రారంభం కాబోతుంది. సో బీఆర్ఎస్ పెద్దలంతా ఇప్పుడు కోర్టుల చుట్టు తిరిగే పరిస్థితే కనిపిస్తోంది. మరి ఇలాంటి సమయంలో పార్టీ మనుగడ ఎలా అన్న ఆలోచన నేతల్లో ఉంది. ఎట్ ది సేమ్ టైమ్.. బీఆర్‌ఎస్‌ అంటే కేవలం ఒక కుటుంబమే అనే ప్రచారం ఉంది. వారు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్టుగా నడిచింది వ్యవహారం. ఇన్నాళ్లు అధికారం ఉంది కదా అని సర్దుకుపోయిన నేతలంతా ఇప్పుడు చాన్స్ దొరికింది కాబట్టి ఎవరి తట్టాబుట్టా వాళ్లు సర్దుకుంటున్నారు.

ఓ వైపు రాజకీయాల్లో ఇలా ముఖచిత్రం మారుతుంటే.. బీఆర్ఎస్‌ మాత్రం తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులు చేస్తూ ఇలా తాతల కాలం నాటి పొలిటికల్‌ మైండ్ గేమ్‌ను ఆడుతుంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా? అంటే నో అనే ఆన్సరే వస్తుంది. టు బీ ఫ్రాంక్‌.. ఈ వలసలకు కారణం బీఆర్ఎసే అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌ ఓ ప్రచారం మొదలుపెట్టింది. వెరీ సూన్ కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతుంది.. మళ్లీ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుంది. ఇదే డైలాగ్‌ను చాలా మంది బీఆర్ఎస్ పెద్దల నోటి నుంచి పలుసార్లు వచ్చింది. ఇలాంటి ప్రకటనలతో కేడర్‌లో ధీమాను నింపాలనుకుంది. కానీ పదే పదే సర్కార్ కూలగొడుతాం అనే ప్రచారంతో కాంగ్రెస్‌ను తట్టి లేపింది బీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ నేతలు ముందు జాగ్రత్త పడటం ప్రారంభమైంది. తెర ముందు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న సమయంలోనే తెర వెనకు చేయాల్సిందంతా చేస్తూ వచ్చారు. మనం ముందుగా అనుకున్నట్టు కౌన్సిలర్ల నుంచి ఎంపీల వరకు టచ్‌లోకి వెళ్లారు, కలిశారు.. కాంగ్రెస్‌ కండువా కప్పేశారు. సింపుల్‌గా చెప్పాలంటే బీఆర్‌ఎస్‌ నేతలు మాటల్లో చెబుతున్నవన్నీ.. చేతల్లో చేసి చూపించారు కాంగ్రెస్ నేతలు.

Also Read: కేసీఆర్.. కవిత.. ఓ లిక్కర్ స్కామ్..

మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే.. సొంత కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్‌కు షాక్ ఇస్తున్నారు. ఇన్నాళ్లు కేసీఆర్‌ వెంట తిరిగిన ఆయన బావమరిది ఎడ్ల రాహుల్‌ కూడా కాంగ్రెస్‌లో చేరారు. మైనంపల్లి హన్మంతరావుతో కలిసి సీఎం రేవంత్‌ను కలిశారు రాహుల్‌. ఆ తరువాత కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. ఇంతకీ ఈ రాహుల్ ఎవరనే కదా మీ డౌట్.. కేటీఆర్ భార్య శైలిమ చిన్నమ్మ కొడుకే ఈ రాహుల్‌. ఇన్నేళ్ల పాటు కేటీఆర్‌కు రైట్‌హ్యాండ్‌గా వ్యవహరించారు ఆయన. కేటీఆర్‌ నీడలా ఎప్పుడూ వెంట తిరిగే వారు.. కానీ సడెన్‌గా కాంగ్రెస్‌లో చేరిపోవడంతో కేటీఆర్‌ అవాక్కయ్యారనే చెప్పాలి.

ఓవరాల్‌గా చూస్తే.. చెరపకురా.. చెడేవు.. అనే సామెతకు సరిగ్గా సూటయ్యేలా ఉన్నాయి మాజీ సీఎం కేసీఆర్ చర్యలు. ఇప్పుడు మరో కొత్త డైలాగ్‌ కూడా వినిపిస్తోంది బీఆర్ఎస్‌ నేతల నోటి నుంచి, పార్టీ వీడి వెళ్లినవాళ్లను మళ్లీ తీసుకోం.. కాళ్లు మొక్కినా రానివ్వం.. అని. ఇది విన్న తెలంగాణ ప్రజలు మరోసారి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఉద్యమకాలంలో సమైక్యరాగం వినిపించిన ఎంతో మందికి, ఆ తర్వాత తీసుకొచ్చి పెద్ద కుర్చి వేసి నెత్తిన పెట్టుకున్న చరిత్ర ఇప్పటి బీఆర్ఎస్‌.. అప్పటి టీఆర్‌ఎస్‌ది. మరి ఈ మాటలను కూడా ప్రజలు నమ్ముతారా? అనేది బిగ్ క్వశ్చన్.. ఇప్పటికైనా తోకపిట్ట, లొట్టపీసులాంటి మాటలు కాకుండా ప్రభుత్వ పాలసీలపై ఫోకస్ చేస్తే అంతో ఇంతో పరువు కాపాడుకోవచ్చని చెప్తున్నారు ప్రజలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News